* iQOO 7 5G : ఐకూ 7 5జీ ఫోన్ 8GB RAM/128 GB వేరియంట్‌ను రూ. 24,990కు కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ 120Hz రిఫ్రెష్ రేట్,1300 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.62-అంగుళాల HDR10+ కంప్లైంట్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో అందుబాటులో ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్తో పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 4400 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది FunTouch OS 11తో రన్ అవుతుంది.
* Realme 9 Pro+ 5G : ఈ ఫోన్ 6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం రూ.24,999కు లభిస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 920 SoC ప్రాసెసర్, 50MP+8MP+2MPతో కూడిన రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.
* Redmi K50i 5G : రెడ్మీ కే50ఐ స్మార్ట్‌ఫోన్ 6GB RAM/128GB storage వేరియంట్‌ను రూ.23,999 సొంతం చేసుకోవచ్చు. ఇది 6.6-అంగుళాల ఫుల్ HD+ లిక్విడ్ FFS డిస్ప్లేతో లభిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్‌తో స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 144 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో 5080 mAh బ్యాటరీ ఉంటుంది.
67W సపోర్ట్‌తో టర్బో ఛార్జర్ కేవలం 15 నిమిషాల్లో 50% ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ MIUI 13తో రన్ అవుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8100 SoCతో పనిచేస్తుంది. 64MP మెయిన్ కెమెరా+ 8MP అల్ట్రావైడ్ షూటర్ + 2MP మాక్రో కెమెరాతో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందుభాగంలో 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
* Xiaomi 11 Lite NE 5G : ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM/128GB storage వేరియంట్ ప్రస్తుతం రూ. 24,999కు అందుబాటులో ఉంది. ఇది కేవలం 6.81 మిమీ మందంతో 158 గ్రాముల బరువు ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇందులోని బ్యాటరీ సామర్థ్యం 4250 mAhగా ఉంటుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్ HD+ 10-బిట్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్ ద్వారా స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది. 64MP ప్రైమరీ కెమెరా+8MP అల్ట్రావైడ్ స్నాపర్ + 5MPతో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందుభాగంలో 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.