నగరంలోని దాదాపు 40 పోలీస్ స్టేషన్లలో స్కామర్లు పంపిన లింక్‌లపై క్లిక్ చేసి డబ్బు పోగొట్టుకున్న కేసులు నమోదయ్యాయి. తాజాగా మోసగాళ్లు కొత్త తరహా మోసానికి తెరతీశారు. ఒక బాధితురాలి నుంచి డబ్బు కాజేయడానికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్ కూడా ఇచ్చారు. ఈ కొత్త తరహా ఫ్రాడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
* ఫ్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ఆఫర్ : ఈ ఏడాది జనవరిలో పన్వేల్‌కు చెందిన 40 ఏళ్ల మహిళను మోసగాడు సౌరభ్ శర్మ్ సంప్రదించాడు. తనను బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. ఆమెకు ఓ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేశాడు. దీని ద్వారా నగరంలోని స్పోర్ట్స్ క్లబ్లో మెంబర్షిప్ లభిస్తుందని చెప్పాడు. ఆమె ఈ మాటలు నమ్మి, కార్డు తీసుకునేందుకు అంగీకరించింది.
* రూ.7 లక్షలకు షాపింగ్ : మహిళ ఆండ్రాయిడ్ ఫోన్లో తన సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసింది. క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేసుకోవడానికి మోసగాడు చెప్పిన సూచనలను ఫాలో అయింది. ఈ ప్రాసెస్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఆ మహిళకు బ్యాంకు ట్రాన్సాక్షన్లకు సంబంధించిన రెండు మెసేజ్‌లు వచ్చాయి. మోసగాడు బెంగుళూరులోని ఒక జ్యువెలరీ షాపులో క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.7 లక్షలకు షాపింగ్ చేశాడు.