* నెగిటివ్ టెస్టింగ్ అంటే? : విభిన్న ఫీచర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడటం లేదా ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కలిగే మార్పులు, యాప్ ఎంత వేగంగా రన్ అవుతోంది? వంటి సమస్యలను పరీక్షించడానికి ఉపయోగించే పద్ధతినే ‘నెగిటివ్ టెస్టింగ్’ అంటారు. నెగిటివ్ టెస్టింగ్ ద్వారా కంపెనీ ఫేస్బుక్ వినియోగదారుల ఫోన్ల బ్యాటరీని హరిస్తోందని జార్జ్ ఆరోపించారు.
* ఎలా గుర్తించారు? : నెగిటివ్ టెస్టింగ్ చేయడం వల్ల కొందరికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న విషయాన్ని తన మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినట్లు జార్జ్ వెల్లడించారు. భారీ మొత్తంలో మంచి చేస్తున్నప్పుడు కొందరికి చెడు చేయడం తప్పేమీ కాదని తన మేనేజర్ బదులిచ్చినట్లు జార్జ్ చెప్పారు. అయితే, ఈ టెస్టులో తను పాల్గొనబోనని చెప్పానన్నారు.
నెగిటివ్ టెస్టింగ్ వల్ల ఎంతమంది వినియోగదారుల ఫోన్లు ప్రభావితమయ్యాయన్న విషయం స్పష్టంగా తెలియదని జార్జ్ చెప్పారు. తన చేతికి ‘హౌ టు రన్ థాట్ఫుల్ నెగిటివ్ టెస్టింగ్’ డాక్యుమెంట్ వచ్చాకే నెగిటివ్ టెస్టింగ్ ప్రక్రియ మొదలైందని తెలిపారు. అయితే, జార్జ్ ఆరోపణలపై ఫేస్బుక్ మాతృసంస్థ మెటా అధికారికంగా స్పందించలేదు.