1. ముఖ్యమైన ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్‌ను (Google Drive) చాలామంది ఉపయోగిస్తుంటారు. కానీ వాటిని డివైజ్‌లో డౌన్లోడ్ చేసి, ఇతరులకు షేర్ చేయడం అనేది సుదీర్ఘ ప్రక్రియ. ఇలా డ్రైవ్ నుంచి డౌన్లోడ్ (Files Download) చేసి ఫైల్ని షేర్ చేయడానికి బదులుగా.. వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌ను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు టెక్ ఎక్స్పర్ట్స్. (ప్రతీకాత్మక చిత్రం)
2. మీ ఫైల్ కోసం డైరెక్ట్ డౌన్లోడ్ లింక్‌ను ఎనేబుల్ చేయడానికి.. కస్టమర్ లింక్‌లో షేర్డ్ ఫైల్ ఐడీని ఇది ఉపయోగిస్తుంది. విండోస్, మాక్, లైనక్స్, క్రోమ్‌బుక్, ఐఫోన్, ఐపాడ్, ఆండ్రాయిడ్ సహా అన్ని డివైజ్‌లలో ఈ పద్ధతిని అనుసరించవచ్చు. ఈ లింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
4. మీ ఫైల్‌పై రైట్ క్లిక్ చేసి మెనూలో కనిపించే "షేర్" ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇప్పుడు ‘షేర్ విత్ పీపుల్ అండ్ గ్రూప్స్’ విండో ఓపెన్ అవుతుంది. ఎంపిక చేసిన వారికి మాత్రమే మీ ఫైల్‌ను డౌన్లోడ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వాలనుకుంటే.. మీ ఫైల్ని వారితో పంచుకోవచ్చు. ఇందుకు ‘యాడ్ పీపుల్ అండ్ గ్రూప్స్’ అనే ఐకాన్‌ను ఎంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎవరికి ఫైల్‌ను షేర్ చేయాలనుకుంటున్నారో.. వారి ఈమెయిల్ ఐడీని ఇందులో యాడ్ చేయాలి. దీంతోపాటు ఇంటర్నెట్లో ఎవరైనా మీ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఇవ్వచ్చు. ఇందుకు విండో కింది భాగంలో ‘చేంజ్ టూ ఎనీవన్ విత్ ద లింక్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్‌ను ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
6. షేర్ విత్ పీపుల్ అండ్ గ్రూప్స్ విండోలోనే దీనికి సంబంధించిన ప్రాసెస్‌ను కొనసాగించాలి. ఇందులో ‘గెట్ లింక్’ అనే సెక్షన్ నుంచి ‘కాపీ లింక్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఫైల్ లింక్ కాపీ అవుతుంది. ఈ లింక్‌లో d/..... /view మధ్య ఉన్న టెక్స్ట్‌ను కాపీ చేయండి. ఇదే మీ గూగుల్ డ్రైవ్ ఫైల్‌కు సంబంధించిన యూనిక్ ఫైల్ ఐడీ. (ప్రతీకాత్మక చిత్రం)
7. గూగుల్ డ్రైవ్ సైట్లో కనిపించే లింక్‌లోని FILEID స్థానంలో.. కాపీ చేసిన యూనిక్ ఫైల్ ఐడీని పేస్ట్ చేయండి. మీరు ఎంచుకున్న గూగుల్ డ్రైవ్ ఫైల్‌కు సంబంధించిన డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే. ఈ లింక్‌ను బ్రౌజర్లో పేస్ట్ చేస్తే.. వెబ్ పేజీని డిస్ప్లే చేయడానికి బదులుగా నేరుగా ఫైల్ డౌన్లోడ్ స్టేజ్‌కు వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)