PM Kisan: పీఎం కిసాన్ కు అప్లై చేసినా అకౌంట్లో డబ్బులు జమ అవ్వడం లేదా.. అయితే ఇలా చేయండి..
PM Kisan: పీఎం కిసాన్ కు అప్లై చేసినా అకౌంట్లో డబ్బులు జమ అవ్వడం లేదా.. అయితే ఇలా చేయండి..
PM Kisan: రైతులకు మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.6,000 అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే చిన్న తప్పుల వల్ల చాలా మంది రైతుల అకౌంట్లో నగదు జమ కావడం లేదు.
ఇప్పటికే చాలా మంది కిసాన్ స్కీమ్‌లో చేరారు. మోదీ ప్రభుత్వం అందించే రూ.6,000 పొందుతున్నారు. ఈ రూ.6 వేలు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్న విషయం తెలిసిందే..
2/ 7
దరఖాస్తు సమర్పించిన వారు మళ్లీ దానిని కరెక్షన్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు.
3/ 7
దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. https://pmkisan.gov.in/ దీని ద్వారా వెబ్‌సైట్‌కు వెళ్లొచ్చు.
4/ 7
ఇప్పుడు వెబ్సైట్లో కుడి వైపున ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. అందులో ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
5/ 7
ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వివరాలు కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసుకొని సరిదిద్దుకోవాలి.
6/ 7
ఏమైనా తప్పులు ఉంటే pmkisan- ict@gov.in మెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు.
7/ 7
లేదంటే పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266, పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్: 011—23381092, 23382401 నెంబర్లను సంప్రదించవచ్చు.