1. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత వివిధ ప్రాంతాలను చుట్టి రావడం తేలికైపోయింది. జర్నీ రూట్స్ తెలియకపోయినా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ (Google Maps) దారి చూపుతున్నాయి. అదే విధంగా భద్రత కోసం మన లైవ్ లొకేషన్ని కూడా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సేర్ చేయవచ్చు. నిరంతరం మన కదలికలు వారికి తెలుస్తూ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కూడా ఈ తరహా ఫీచర్‌ను అందిస్తోంది. వాట్సాప్ వినియోగదారులు రియల్ టైమ్ లొకేషన్ని ఇతర వినియోగదారులతో షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ లైవ్ లొకేషన్ ఫీచర్ తమ లైవ్ లొకేషన్ (Live Location)ను ఎంతసేపు షేర్ చేయవచ్చనే టైమ్‌ను సెలక్ట్ చేసుకొనే సదుపాయం కూడా కల్పిస్తోంది. అదే విధంగా ఎప్పుడైనా లైవ్ లొకేషన్ షేరింగ్‌ను ఆపివేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వాట్సాప్ మెసేజ్‌ల తరహాలోనే.. లైవ్ లొకేషన్ ఫీచర్ కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. అంటే లొకేషన్ షేర్ చేసిన వ్యక్తులు తప్ప, లైవ్ లొకేషన్‌ను ఎవరూ చూడలేరు. వాట్సాప్‌లో లొకేషన్‌ను షేర్ చేయడానికి ముందు, స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో WhatsApp లొకేషన్ పర్మిషన్లు ఎనేబుల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ముందుగా స్మార్ట్ఫోన్లని సెట్టింగ్స్(Settings) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లో కనిపించే యాప్స్ అండ్ నోటఫికేషన్స్(Apps and Notifications) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్‌లోకి వెళ్లి యాప్ పర్మిషన్స్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లొకేషన్‌పై ట్యాప్ చేసి, WhatsAppని ఆన్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్‌కు లొకేషన్‌కు యాక్సెస్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. వాట్సాప్‌లో ఇతర వినియోగదారులకు లొకేషన్ షేర్ చేయడానికి ముందుగా.. వాట్సాప్ ఓపెన్ చేయాలి. లైవ్ లొకేషన్ని షేర్ చేయాలనుకుంటున్న వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌కి వెళ్లాలి. అక్కడ చాట్ విండోస్‌లో.. అటాచ్, లొకేషన్, షేర్ లైవ్ లొకేషన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్న సమయాన్ని ఎంచుకోవచ్చు. తర్వాత సెండ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ సమయం పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా లైవ్ లొకేషన్ షేరింగ్ ఎండ్ అయిపోతుంది. అవసరమైతే.. లొకేషన్ షేరింగ్‌ను మధ్యలోనే ఆపేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇండివిడ్యువల్ ఛాట్స్‌కి లొకేషన్ షేరింగ్ ఆపాలంటే వాట్సాప్‌లో ఇండివిడ్యువల్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ స్టాప్ షేరింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టాప్‌పై క్లిక్ చేయాలి. దీంతో లైవ్ లొకేషన్ షేరింగ్ ఆగిపోతుంది. గ్రూప్ ఛాట్స్‌కి లొకేషన్ షేరింగ్ ఆపాలంటే వాట్సాప్‌లో సంబంధిత గ్రూప్‌ను ఓపెన్ చేయాలి. మోర్ ఆప్షన్స్‌పై క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ప్రైవసీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అందులో లైవ్ లొకేషన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టాప్ షేరింగ్‌పై క్లిక్ చేయాలి, చివరిగా స్టాప్‌పై ప్రెస్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)