1. వాట్సప్... ఒకప్పుడు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ మాత్రమే. కానీ ఇప్పుడు వాట్సప్‌లో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ పంపొచ్చు. వీడియో కాల్స్ చేయొచ్చు. వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇటీవల వాట్సప్ పేమెంట్స్ (WhatsApp Payments) సర్వీస్‌తో డబ్బులు కూడా పంపే అవకాశం కూడా లభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే వాట్సప్ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాట్సప్ ద్వారా మెసేజెస్ (WhatsApp Messages) పంపి వేధించేవారు ఉంటారు. లేదా అనవసరమైన మేసెజెస్ పంపి చికాకు పెట్టే స్నేహితులూ ఉంటారు. స్నేహితుల్ని వాట్సప్‌లో బ్లాక్ చేసినట్టు తెలిస్తే మళ్లీ అదో చికాకు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే అవతలివారికి తెలియకుండా సింపుల్‌గా బ్లాక్ చేసే అవకాశం కల్పిస్తోంది వాట్సప్. మిమ్మల్ని వాట్సప్‌లో ఎవరైనా చికాకుపెడుతున్నట్టైతే వారికి తెలియకుండా బ్లాక్ చేయొచ్చు. యాపిల్ ఐఓఎస్ యూజర్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. మరి సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. కాంటాక్ట్ ఆర్కైవ్ చేయడానికి ముందుగా మీ వాట్సప్ యాప్ అప్డేట్ చేయండి. ఆ తర్వాత వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారి కాంటాక్ట్ సెలెక్ట్ చేయండి. మీరు ఒకేసారి ఎన్ని కాంటాక్ట్స్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టైతే లాంగ్ ట్యాప్ చేయండి. ఆ తర్వాత డౌన్ యారో పైన క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఒకవేళ యాపిల్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టైతే కాంటాక్ట్ పైన లాంగ్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత లెఫ్ట్‌కి స్వైప్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన కాంటాక్ట్స్ ఆర్కైవ్‌లోకి వెళ్తాయి. ఆర్కైవ్ చేసిన కాంటాక్ట్స్ చూడటానికి వాట్సప్ యాప్ ఓపెన్ చేయాలి. హోమ్ స్క్రీన్‌లో టాప్‌లో ఆర్కైవ్డ్ ఛాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఏఏ ఛాట్స్ ఆర్కైవ్ చేశారో కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీరు ఒకసారి ఏదైనా ఛాట్‌ను ఆర్కైవ్ చేశారంటే ఆ కాంటాక్ట్ నుంచి వచ్చే మెసేజెస్, కాల్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవీ రావు. కాబట్టి కాంటాక్ట్స్‌ని ఆర్కైవ్ చేసేముందు ఈ విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఆర్కైవ్ చేసిన విషయం అవతలివారికి తెలియదు. ఆర్కైవ్ చేస్తే వారిని బ్లాక్ చేసినట్టు కాదు. (ప్రతీకాత్మక చిత్రం)