సాంకేతికత పెరుగుతున్నా కొద్దీ బ్యాంకింగ్ అందులో ముఖ్యంగా పేమెంట్స్ కు సంబంధించిన వేగం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఒకప్పుడు కరెంట్ బిల్లు కోసం విద్యుత్ కార్యాలయానికి వెళ్లి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని వివిధ యాప్ ల ద్వాారా చిటికెలో బిల్ చెల్లించే పరిస్థితి ఉంది. కేవలం కరెంట్ బిల్ మాత్రమే కాదు.. ఇంకా అనేక రకాల చెల్లింపులు అరచేతిలోనే జరిగిపోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మీ UPI పిన్ ఎవరికీ చెప్పకండి. ఏ కంపెనీ మీ UPI పిన్ను అడగదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి UPI పిన్ని ఎవరికీ చెప్పకండి. WhatsApp, SMS ద్వారా UPI పిన్ను అస్సలు షేర్ చేయవద్దు. ఎవరైనా మిమ్మల్ని UPI పిన్ కోసం అడిగితే, మీరు దానిని చీటింగ్గా పరిగణించి అనుమానించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఆన్లైన్లో బహుమతుల పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. నిర్దిష్ట బహుమతిని గెలవడానికి మీ UPI యాప్లో UPI పిన్ని నమోదు చేయమని ఎవరైనా మిమ్మల్ని అడుగుతుంటే, అది మోసం అని మీరు తప్పనిసరిగా గుర్తించాలి. అలాంటి సందర్భాల్లో మీరు మీ UPI పిన్ని నమోదు చేస్తే మీ ఖాతా ఖాళీ కావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.(ప్రతీకాత్మక చిత్రం)
మీరు UPI యాప్ ద్వారా చెల్లిస్తున్నా లేదా ఎవరికైనా డబ్బు పంపుతున్నా వారి వివరాలను తనిఖీ చేయాలి. కొత్త నంబర్ కు డబ్బులు పంపించే సమయంలో వారి నంబర్ నమోదు చేయగానే వచ్చే పేరును ఓ సారి పరిశీలించాలి. ఆ పేరు సరైనదే అని నిర్ధారించుకున్న తర్వాతనే మీరు పేమెంట్స్ పూర్తి చేయాలి. ఇంకా మీరు మీ యూపీఐ పిన్ ను నెలకు ఓ సారి మార్చుకోవడం మంచిది. ఎప్పుడు ఒకే పిన్ ను మార్చకుండా వినియోగించడం అంత మంచిది కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా మీ ఫోన్ నంబర్ లో కొంత భాగాన్ని, మీ పుట్టిన రోజును యూపీఐ పిన్ గా పెట్టుకోవద్దు. అలా చేస్తే మీరు సులువుగా సైబర్ నేరగాళ్లకు దొరికిపోతారు. మీరు ఎవరి దగ్గర నుంచైన డబ్బులను స్వీకరించాల్సిన పరిస్థితి వస్తే UPI పిన్ని నమోదు చేయనవసరం లేదని గుర్తుంచుకోండి. అంటే మీరు డబ్బును బదిలీ చేయడానికి మాత్రమే UPI పిన్ను నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ డబ్బును స్వీకరించడానికి మీరు UPI పిన్ను నమోదు చేయవలసిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)