ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్ ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. దేశంలో 5G సేవలు ప్రారంభమైన ఈ తరుణంలో 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఈ సేల్ సూపర్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
పోకో ఎక్స్ 4 ప్రో 5G (POCO X4 Pro 5G) ఫోన్ పై ఈ సేల్ లో మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.23,999. అయితే ఈ ఫోన్ పై 29 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అంటే ఎవరైనా రూ.7 వేల తగ్గింపుతో రూ.16,999కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇంకా కొటాక్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.1250 వరకు తగ్గింపు అందుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై రూ.16250 ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా ఈ తగ్గింపును పొందొచ్చు. ఈ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తే రూ.749కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ ఫోన్ లో 4GB RAM ర్యామ్ ఉంటుంది. ఇంకా 128GB స్టోరేజ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇంకా 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ ఆల్మోడ్ డిస్ప్లే ఈ ఫోన్ సొంతం. ఇంకా ఈ ఫోన్ లో 5000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)