ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్రస్తుతం బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Savings Day sale) నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ స్పెషల్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ప్రకటించింది. ముఖ్యంగా పాపులర్ మిడ్-రేంజ్ మొబైల్ నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1)పై అదిరిపోయే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
* ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కిల్లింగ్ డీల్స్ : 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ గల నథింగ్ ఫోన్ 1 అసలు ధర రూ.39,999 ఉండగా.. అది బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో రూ.27,499కి దిగి వచ్చింది. బ్లాక్ కలర్ వేరియంట్ పైనే ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఇక 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ గల నథింగ్ ఫోన్ 1 అసలు ధర రూ.37,999 కాగా.. అది బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో రూ.25,499కి దిగి వచ్చింది.
దీని అర్థం రెండు ఫోన్లు దాదాపు రూ.12 వేల వరకు తగ్గింపు ధరలతో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా వీటి ప్రైస్‌లు తగ్గించుకునేందుకు కొనుగోలుదారులు తమ ఓల్డ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మార్చుకోవచ్చు. సుమారు 6 నెలల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్లు మునుపెన్నడూ లేనంత డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వీటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ దొరకదు.
* నథింగ్ ఫోన్ వన్ ఫీచర్లు : నథింగ్ ఫోన్ (1) స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ప్రత్యేకమైన గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఇప్పటివరకు వచ్చిన మొబైల్ ఫోన్స్ అన్నిటికీ భిన్నంగా ఉంటుంది. ఇందులో నైట్ మోడ్, సీన్ డిటెక్షన్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లతో డ్యూయల్ 50 MP కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్ HD+ OLED డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ కాల్ ఆఫ్ డ్యూటీ వంటి హెవీ గేమ్స్ చాలా స్మూత్‌గా, ల్యాగ్ ఫ్రీగా హ్యాండిల్ చేయగలదు. ఈ స్మార్ట్‌ఫోన్ 18 గంటల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 30 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది. ఇది నథింగ్ ఇయర్ కోసం రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. నథింగ్ ఫోన్ (1) 4,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.