1. ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ మొబైల్ ధమాకా కొనసాగుతోంది. ఈ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లను అమ్ముతోంది ఫ్లిప్‌కార్ట్. యాపిల్, షావోమీ, సాంసంగ్, వివో లాంటి బ్రాండ్స్ స్మార్ట్ఫోన్లు సెకండ్ హ్యాండ్లో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.8,199 ధరకే కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 4 అంగుళాల రెటీనా డిస్ప్లే ఉంది. ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. యాపిల్ ఏ9 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 128జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. కెమెరా ఫీచర్స్ చూస్తే 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 1.2 ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
4. కెమెరాలో రెటీనా ఫ్లాష్, ఆటో హెచ్డీర్, బ్యాక్‌సైడ్ ఇల్యుమినేషన్ సెన్సార్, ఎక్స్పోజర్ కంట్రోల్, ఇంప్రూవ్డ్ లోకల్ టోన్ మ్యాపింగ్, బరస్ట్ మోడ్, టైమర్ మోడ్, ఫేస్ డిటెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఎన్ఎఫ్సీ, యూఎస్బీ కనెక్టివిటీ, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ మొబైల్ ధమాకా సేల్‌లో మరిన్ని యాపిల్ ఐఫోన్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 6ఎస్ మోడల్‌ను రూ.8,999 ధరకు, ఐఫోన్ 6 మోడల్‌ను రూ.10,699 ధరకు, ఐఫోన్ 7 మోడల్‌ను రూ.12,988 ధరకు, ఐఫోన్ 6ఎస్ ప్లస్ మోడల్‌ను రూ.14,999 ధరకు, ఐఫోన్ 8 మోడల్‌ను రూ.17,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ అంటే సెకండ్ హ్యాండ్ మోడల్ అని అర్థం. ఈ స్మార్ట్ఫోన్లను నిపుణులతో 49 క్వాలిటీ చెక్స్ చేయించి అమ్ముతుంది ఫ్లిప్‌కార్ట్. Unboxed - Like New, Refurbished - Superb, Refurbished - Good, Refurbished - Okay అని నాలుగు కేటగిరీల్లో సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లు లభిస్తాయి. వీటికి వారెంటీ వేర్వేరుగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)