Mobile Bonanza Sale | ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవల సరికొత్త సేల్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. మొబైల్ బొనాంజా సేల్ పేరుతో వివిధ సెగ్మెంట్లకు చెందిన టాప్ బ్రాండ్స్ స్మార్ట్ఫోన్లపై బంపరాఫర్లను ప్రకటించింది. నవంబర్ 8 నుంచి నవంబర్ 14 వరకు కొనసాగే ఈ స్పెషల్ సేల్‌లో చాలా ఫోన్లను రూ.1000లోపు సొంతం చేసుకోవచ్చు. అందులో శామ్సంగ్ గెలాక్సీ F23 5G ఒకటి. ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న స్పెషల్ ఆఫర్లతో డివైజ్ ధర భారీగా తగ్గుతుంది.
ఈ ఫోన్‌పై అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ డివైజ్ కొనుగోలు చేసేవారు పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే, దాదాపు రూ.15,300 వరకు ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ పొందవచ్చు. కస్టమర్లు మంచి బ్రాండెడ్, వర్కింగ్ కండిషన్లో ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, ఫ్లిప్‌కార్ట్ దానిపై పూర్తి విలువను మాఫీ చేస్తుంది. అంటే ఇప్పుడు శామ్సంగ్ గెలాక్సీ F23 5Gను రూ.699కు కొనుగోలు చేయవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ F23 5G.. 1080×2408 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.60 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక, ముందు భాగంలో 8ఎంపీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 4జీబీ-128జీబీ, 6జీబీ-128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 5000ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఓఎస్ అండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది.
ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్‌లో వివిధ బ్రాండ్స్‌కు చెందిన మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లపై మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లలో మోటరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌ను రూ.26,999కు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 4020 mAh బ్యాటరీ ఉంటుంది.
ఒప్పొ F21 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌పై తాజా ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 18 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీన్ని రూ. 25,999కు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల డిస్ప్లేతో అందుబాటులో ఉంది. ఇందులో 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో పాటు వెనుక వైపు 64MP మెయిన్ కెమెరా సెటప్ ఉంటుంది.