Mobiles Bonanza Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.599 ఆఫర్.. పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ పొందండిలా!
Mobiles Bonanza Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.599 ఆఫర్.. పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ పొందండిలా!
Flipkart Offers | కొత్త ఫోన్ కొనాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. పలు రకాల డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Flipkart Sale | కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు పొందొచ్చు. వివిధ రకాల ఆఫర్లు లభిస్తున్నాయి. అన్నింటినీ పొందితే చాలా తక్కువ ధరకే కొత్త ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
2/ 9
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో కొత్త సేల్ తీసుకువచ్చింది. మొబైల్స్ బొనాంజా సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్లపై అదిరే ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఏ ఏ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
3/ 9
నవంబర్ 14 వరకు అందుబాటులో ఉండనున్న మొబైల్స్ బొనాంజా సేల్‌లో శాంసంగ్ పాపులర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్13 ఫోన్‌పై కళ్లుచెదిరే డీల్ సొంతం చేసుకోవచ్చు. పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
4/ 9
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ రూ. 14,999గా ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ఫోన్‌ను ఇప్పుడు మొబైల్స్ బొనాంజా సేల్‌లో భాగంగా రూ. 10,999కు కొనొచ్చు.
5/ 9
అంతేకాకుండా మీకు బ్యాంక్ ఆఫర్ కూడా ఒకటి అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా రూ. 750 వరకు తగ్గింపు వస్తుంది. అంటే ఈ రెండు ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫోన్‌ను రూ. 10,249కే కొనుగోలు చేయొచ్చు.
6/ 9
అంతేకాకుండా ఈ ఫోన్‌పై మరో డీల్ కూడా అందుబాటులో ఉంది. అదే ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 10,400 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు లభిస్తోంది. అంటే ఈ ఆఫర్ కింద మీరు కేవలం రూ. 599 చెల్లించి కొత్త ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
7/ 9
అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్, దాని కండీషన్ ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది. కొన్ని ఫోన్లకు తక్కువ ఎక్స్చేంజ్ లభించొచ్చు. అందువల్ల ఫోన్ కొనాలని భావించే వారు వారి పాత ఫోన్‌ను ఎంత ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందో చెక్ చేసుకోండి.
8/ 9
ఇకపోతే ఈఎంఐలో కొనుగోలు చేయాలని భావిస్తే.. ఎలాంటి ఆప్షన్లు లభిస్తున్నాయో చెక్ చేసుకుందాం. ఈఎంఐ నెలకు రూ. 988 నుంచి స్టార్ట్ అవుతోంది. 12 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే ఆరు నెలలు అయితే రూ. 1909 కట్టాలి. 9 నెలలు అయితే రూ. 1295 చెల్లించాలి.
9/ 9
క్రెడిట్ కార్డు లేని వారు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ ద్వారా ఈ ఫోన్‌ను కొనొచ్చు. దీని కన్నా ముందు మీరు ఈ సర్వీసులను యాక్టివేట్ చేసుకొని ఉండాలి. 12 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1041 కట్టాల్సి ఉంటుంది.