దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు స్పెషల్ ఆఫర్లను అందిస్తుంది. తాజాగా ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో సేల్ ఈవెంట్‌ను మార్చి 11 నుంచి ప్రారంభించనుంది. దీనికి సంబంధించి తాజాగా ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో టాప్ బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్స్‌పై బెస్ట్ డీల్స్ పొందవచ్చు. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోగల ప్రీమియం డివైజ్‌లు ఏవో చూద్దాం.
* నథింగ్ ఫోన్ (1) : బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ (1)ను భారీ డిస్కౌంట్స్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 128GB మోడల్ ప్రస్తుతం రూ.27,999కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్, ఎక్ఛేంజ్ ఆఫర్లో భాగంగా దీన్ని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25,000కు సొంతం చేసుకోవచ్చు. దాదాపు రూ.3000 డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
* ఐఫోన్ 14 : బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.71,999కు అందుబాటులో ఉంది. అయితే ఈ సేల్‌లో ఐఫోన్ 14 రూ.60,009 నుంచి రూ.69,999 మధ్య లభిస్తుంది. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అన్నీ కలుపుకుంటే రూ.60,000లో సొంతం చేసుకోవచ్చు.
* ఐఫోన్14 ఫ్లస్ : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 14 ప్లస్‌ను రూ.80,000 లోపు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14లో వైడ్ నాచ్డ్ డిజైన్‌తో 6.1-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లే ఉంటుంది. ఇది A15 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్సెట్ లెటెస్ట్ iOS 16 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. ఫోన్ రియర్ ప్యానెల్లో రెండు కెమెరాలు ఉంటాయి.