ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. స్మాల్ హ్యాండీ ఫోన్ కోసం చూసే వారికి ఐఫోన్ 12 మినీ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ డివైజ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, గ్రేట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌తో 2020లో లాంచ్ అయింది. 64gb వేరియంట్ ధర రూ.59,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు రూ.20,999కే కొనుగోలు చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్ వివరాలు
ప్రస్తుతం 64 gb ఐఫోన్ 12 మినీ సిరీస్ ధర 35% డిస్కౌంట్ అనంతరం రూ.38,499గా ఉంది. ఈ ధర ఇంకా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఫోన్ మోడల్ బట్టి, దాని వర్కింగ్ కండిషన్ బట్టి రూ.17,500 వరకు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మొత్తం డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 12 మినీ రూ.20,999కే లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ వివిధ బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించుకుని చేసే ట్రాన్సాక్షన్‌పై 10% డిస్కౌంట్ లభిస్తుంది. రూ.5000పైగా చేసే కోటక్ బ్యాంక్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1000 వరకు ధర తగ్గుతుంది. అలాగే రూ.5000 పైగా కొటక్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లపై రూ.750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదే విధంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5% డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)