Flipkart Geyser Offer: ఫ్లిప్కార్ట్లో కేవలం రూ.3149కే గీజర్.. గ్రాండ్ హోం అప్లియెన్సెస్ సేల్ లో అదిరే ఆఫర్
Flipkart Geyser Offer: ఫ్లిప్కార్ట్లో కేవలం రూ.3149కే గీజర్.. గ్రాండ్ హోం అప్లియెన్సెస్ సేల్ లో అదిరే ఆఫర్
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో భారీ సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ నెల 7న ప్రారంభమైన గ్రాండ్ అప్లియెన్సెస్ సేల్ 11వ తేదీ ముగియనుంది. ఈ సేల్ లో గీజర్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.
దేశమంతా చలి చంపేస్తోంది. ఉదయం 10 దాటినా జనం చలికి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ట్యాప్ తిప్పితే ఫ్రిజ్ లో నుంచి వచ్చిన మాదిరిగా నీళ్లు ఉంటుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది గీజర్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
2/ 7
దీంతో గత రెండు మూడు రోజుల్లో గీజర్ల ఆర్డలు అధికమయ్యాయని ఈ-కామర్స్ సైట్ల లెక్కలు చెబుతున్నాయి. అయితే.. గీజర్ అనగానే ధరలు అధికంగా ఉంటాయని భయపడి అనేక మంది కొనేందుకు భయపడుతున్నారు.
3/ 7
చాలా తక్కువ ధరలోనూ బెస్ట్ గీజర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం నిర్వహిస్తోన్న గ్రాండ్ హోం అప్లియెన్సెస్ సేల్ లో గీజర్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
4/ 7
కేవలం రూ.3 వేల ధరలోనే బెస్ట్ గీజర్లను కొనే అవకాశాన్ని కల్పించింది ఫ్లిప్ కార్ట్. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి. AO Smith 3 L Instant Water Geyser వాస్తవ ధర రూ.4790 కాగా.. 34 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
5/ 7
దీంతో ఎవరైనా రూ.1641 తగ్గింపుతో కేవలం రూ.3149 కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ గీజర్ పై మంచి బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు ఉంది.
6/ 7
ఇంకా ఈ గీజర్ పై రూ.300 ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. మీరు మీ పాత గీజర్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ ను పొందొచ్చు. ఇంకా ఈ గీజర్ పై ఈఎంఐ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
7/ 7
కేవలం రూ.110 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లతో ఈ గీజర్ ను కొనుగోలు చేయవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్లు సైతం ఉన్నాయి.