ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రానిక్ సేల్ కొనసాగుతోంది. ఈసేల్కి చివరి రోజు జనవరి 31. ఈ సేల్ లో ముఖ్యంగా స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఇంకా.. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు మరియు వాటి అప్లియెన్సెస్ పై 75% వరకు తగ్గింపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ టీవీలపై ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
LG UQ7500 164 cm (65 inches) Ultra HD (4K) LED Smart WebOS TV 2022 ఎడిషన్ (65UQ7500PSF) అనేక ప్రత్యేక స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. సేల్ లో.. ఈ టీవీని రూ. 1,14,990కి బదులుగా రూ.79,990కి అందుబాటులో ఉంచారు. దీనిపై వినియోగదారులకు 30% తగ్గింపు ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.11,000 తగ్గింపుతో కస్టమర్లు ఈ టీవీని కొనేయొచ్చు. ఇంకా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
వినియోగదారులు Samsung Crystal 4K 108 cm (43 inch) Ultra HD (4K) LED Smart Tizen TV (UA43AUE60AKLXL)లో మంచి ఫీచర్లను పొందుతారు. సేల్ లో.. ఈ టీవీని రూ. 52,999కి బదులుగా రూ.29,999కి అందుబాటులో ఉంచారు. ఈ టీవీపై వినియోగదారులకు 43% తగ్గింపును అందజేస్తున్నారు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.11,000 తగ్గింపుతో కస్టమర్లు ఇంటికి తీసుకురావచ్చు.
Mi Q1 138.8 cm (55-అంగుళాల) QLED అల్ట్రా HD (4K) స్మార్ట్ Android TV డాల్బీ విజన్ మరియు 30W డాల్బీ ఆడియోతో వస్తుంది. కస్టమర్లు ఈ టీవీని ఎలక్ట్రానిక్ సేల్ లో రూ.59,999కి కొనుగోలు చేయవచ్చు. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి దీనిపై 10% తగ్గింపును పొందవచ్చు, SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 1250 తగ్గింపు లభిస్తుంది. ఇంకా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,900 తగ్గింపుతో కస్టమర్లు ఇంటికి తీసుకురావచ్చు.