ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇటీవల వరుసగా సేల్స్ నిర్వహిస్తూ వినియోగదారులకు భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఏది కొనాలన్నా కూడా రాబోయే సేల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. ఈ సెల్ నవంబర్ 25 నుంచి నవంబర్ 30 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో రూ.10,000 బడ్జెట్ లో వస్తున్న స్మార్ట్ ఫోన్ల వివరాలు మీ కోసం.. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్, సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లు, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు నుంచి చేసే చెల్లింపులపై రూ. 2 వేల వరకు తగ్గింపులు అదనంగా లభించనున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
Redmi 9 Activ : Redmi యొక్క ఈ పరికరంలో, మీరు MediaTek Helio G35 ప్రాసెసర్‌తో HD+ IPS డిస్ప్లేను పొందుతారు. దాని బేస్ మోడల్ పరికరంలో.. మీరు 6GB RAM మరియు 128GB స్టోరేజ్ సామర్థ్యాన్ని పొందుతారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 12,999 కాగా.. సేల్ సమయంలో కేవలం రూ.9,449కే కొనుగోలు చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
Samsung F22 : ఈ Samsung స్మార్ట్ ఫోన్లో మీకు 48MP క్వాడ్ కెమెరా సెటప్, 6,000mAh శక్తివంతమైన బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. AMOLED డిస్ప్లేతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 14,999. అయితే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో మీరు దీన్ని ప్రారంభ ధర రూ.9,399 తో సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)