ప్రస్తుతం కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌టీవీ(Smarttv)లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ (OTT Platform) ట్రెండ్ పెరగడంతో స్మార్ట్ టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్ ఈవెంట్స్ నిర్వహిస్తూ కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
* రియల్మీ నియో హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ Linux టీవీ : బ్లాక్ ఫ్రైడ్ సేల్ సందర్భంగా ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. రియల్మీ కంపెనీకి చెందిన 32 అంగుళాల ఈ స్మార్ట్‌టీవీ Linuxపై రన్ అవుతుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఇది లభిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ 20W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ప్రస్తుతం దీన్ని రూ.11,999కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్టీవిని రూ.11,000కు సొంతం చేసుకోవచ్చు.
* LG 80 సెం.మీ (32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ WebOS TV : బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.21,990 విలువ చేసే దీన్ని కేవలం రూ.11,000కు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా ఈ స్మార్ట్ టీవీని ఫైనల్‌గా రూ.11,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఎల్జీ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌టీవీ WebOSపై రన్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ 50Hz రిఫ్రెష్ రేట్‌తో 10W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
* Mi 5A (32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ Android TV : ఎంఐ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌టీవీ ఆండ్రాయిడ్‌పై రన్ అవుతుంది. ఇన్‌బిల్ట్ గూగుల్ అసిస్టెంట్, క్రోమ్కాస్ట్కు సపోర్ట్ చేస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 20W సౌండ్ అవుట్‌పుట్ అందిస్తుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌టీవీపై బెస్ట్ డీల్‌ను అందిస్తోంది. డాల్బీ ఆడియో (2022 మోడల్) ఫీచర్‌తో లభిస్తున్న ఈ స్మార్ట్‌టీవీని రూ.13,499కు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో దీన్ని రూ.11,000కు సొంతం చేసుకోవచ్చు. ఇందులో బ్యాంక్ ఆఫర్ కలిసి ఉంటుంది.
* OnePlus Y1 (40 అంగుళాల) ఫుల్ HD LED స్మార్ట్ Android TV : వన్‌ప్లస్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో( 40FA1A00)తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ ఆండ్రాయిడ్‌పై రన్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి వాటికి ఈ స్మార్ట్‌టీవీ సపోర్ట్ చేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 20W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. రూ.27,999కు లాంచ్ అయిన ఈ స్మార్ట్‌టీవీని బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,999కు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిపై బ్యాంక్ ఆఫర్‌తో పాటు రూ.రూ.7,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.