3. గతేడాది సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే తొలి రొటేటింగ్ కెమెరాతో ఈ ఫోన్ రిలీజైంది. అంటే రియర్ కెమెరాలే సెల్ఫీ కెమెరాల్లా పనిచేస్తాయి. సెల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు కెమెరా ముందుకు రొటేట్ అవుతుంది. ఈ టెక్నాలజీ చూసి అద్భుతం అన్నారంతా. (image: Samsung India)
4. సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.47,990 ధరకు ఇండియన్ మార్కెట్లో రిలీజైంది. ఈ ఫోన్ అసలు ధర రూ.52,000. కానీ రూ.4,000 తగ్గింపుతో ఇండియాలో రిలీజైంది. కానీ ఆ ధర ఎక్కువ అనుకున్నారు. ఆ తర్వాత కూడా ధర తగ్గింది. జూన్ 22 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.41,999. (image: Samsung India)
7. సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఫుల్హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 9పై, సాంసంగ్ వన్ యూఐతో పనిచేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ గేమింగ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌తో సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. (image: Samsung India)
8. మైక్రో ఎస్డీ కార్డుతో మెమొరీని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ప్రపంచంలోనే తొలి రొటేటింగ్ కెమెరా సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌లో ఉండటం విశేషం. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 3డీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా ఉండటం విశేషం. ఇవే కెమెరాలు రొటేట్ చేసి సెల్ఫీ తీసుకోవచ్చు. 3700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Samsung India)