యాపిల్ ఐఫోన్ 12 ఫోన్ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా తక్కువ ధరకు లభిస్తోంది. ఇండియాలో ఐఫోన్ 12 64GB వేరియంట్ ధర రూ.65,900కాగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో కేవలం రూ.51,999కే లభిస్తోంది. కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌పై రూ.1,000 వరకు డిస్కౌంట్‌తో.. రూ.50,999కి ఫోన్ లభిస్తుంది. కొనుగోలుదారులు వారి పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.17,000 వరకు ధరను తగ్గించుకునే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే ధర రూ.8,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కేవలం రూ.8,499కి, రూ.1,000 డిస్కౌంట్‌తో పొందవచ్చు. దీనితో పాటు బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 కోసం పార్ట్నర్ ఆఫర్ కింద క్యాష్‌బ్యాక్ కూపన్ అందుకోవచ్చు.
ఒప్పో రెనో 8 5G స్మార్ట్‌ఫోన్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది. దీన్ని రూ.29,999కు సొంతం చేసుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ పేమెంట్స్‌పై రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది, పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి రూ.20,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా వివో T1 44W ఫోన్ ధర రూ.15,999 ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లపై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌ఫై పార్ట్నర్ ఆఫర్ కూడా ఉంది, ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం కూపన్‌ను పొందుతారు.