ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ నెల 25 నుంచి 29 వరకు బిగ్ సేవింగ్ డేస్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు, టాబ్లెట్లు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలపై తగ్గింపును అందించనున్నారు. ICICI బ్యాంకు కస్టమర్లు అదనంగా 10 శాతం తగ్గింపును వివిధ కొనుగోళ్లపై అందుకోవచ్చు. రూ. 15 వేల కన్నా తక్కువ ధరకు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి సేల్ లో అనేక ఫోన్లు ధర తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
Poco M3 Pro 5G: ఈ స్మార్ట్ ఫోన్ 6.53-అంగుళాల Full-HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 6GB ర్యామ్ తో పాటు 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 5,000mAh భారీ బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ లో ఈ 5జీ స్మార్ట్ ఫోన్ రూ.13,999 ధర నుంచి అందుబాటులోకి రానుంది.(ప్రతీకాత్మక చిత్రం)
Realme 8 5G: ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 14,499 ధరకు అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ ఫోన్ పై ధర తగ్గింపును అందుకోవచ్చు. ఇంకా ఎక్సేంజ్ ఆఫర్ తో పాటు ICICI బ్యాంకు కస్టమర్లు క్యాష్ బ్యాక్ ను అందుకోవచ్చు. 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం.(ప్రతీకాత్మక చిత్రం)