1. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ముగిసింది. అన్ని ప్రొడక్ట్స్‌పై కాకపోయినా చాలావరకు ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఇచ్చింది ఫ్లిప్‌కార్ట్. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ (Big Dussehra Sale) ప్రారంభమైంది. ఈ సేల్‌లో కొన్ని మొబైల్స్‌పై బిగ్ బిలియన్ డేస్ సేల్ కన్నా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అందులో నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) కూడా ఒకటి. (ప్రతీకాత్మక చిత్రం)
2. నథింగ్ ఫోన్ 1 రిలీజ్ ధరలు చూస్తే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.32,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.35,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999. రిలీజ్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,000 పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ 1 బేస్ వేరియంట్ రూ.28,999 ధరకే లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్‌లో నథింగ్ ఫోన్ 1 మొబైల్ ధర ఇంకా తగ్గింది. బిగ్ బిలియన్ సేల్ ధర కన్నా రూ.2,000 తక్కువకే నథింగ్ ఫోన్ 1 సొంతం చేసుకోవచ్చు. బిగ్ దసరా సేల్‌లో నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.26,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. సేల్ కన్నా ముందు ధరతో పోలిస్తే ఏకంగా రూ.7,000 తక్కువకే నథింగ్ ఫోన్ 1 లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రస్తుతం నథింగ్ ఫోన్ 1 ధరలు చూస్తే 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.29,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.32,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.35,999 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. సేల్ సందర్భంగా లభించే డిస్కౌంట్‌తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్స్‌తో నథింగ్ ఫోన్ 1 బేస్ వేరియంట్ రూ.26,999 ధరకే లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా రూ.16,900 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అంటే మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.16,900 వరకు తగ్గింపు పొందొచ్చు. ఒకవేళ మీ పాత మొబైల్‌కు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే జస్ట్ రూ.10,000 చెల్లించి నథింగ్ ఫోన్ 1 కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఒకవేళ మీ పాత మొబైల్‌కు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ తక్కువ వస్తే మిగతా మొత్తం చెల్లించి నథింగ్ ఫోన్ 1 కొనొచ్చు. మీ పాత మొబైల్‌కు రూ.8,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే మీరు రూ.18,999 చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దసరా సేల్ ముగిసేవరకు ఈ ఆఫర్స్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. నథింగ్ ఫోన్ 1 ఫీచర్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్ప్లే ఉంది. గ్లిఫ్ ఇంటర్ఫేస్ ప్రధాన ఆకర్షణ. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో రిలీజైన రెండో మొబైల్ ఇదే. మోటోరోలో ఎడ్జ్ 30 మోడల్లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. నథింగ్ ఫోన్ 1 ఆండ్రాయిడ్ 12 + నథింగ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ Samsung JN1 సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15వాట్ వైర్‌లైస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)