అయితే దీనికి కొనసాగింపుగా తాజాగా ‘బిగ్ దివాలీ సేల్’ను (Big Diwali sale) నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఆఫర్లు నిన్ననే ప్లస్ మెంబర్స్‌కు లైవ్‌లోకి రాగా, నేటి (అక్టోబర్ 11) నుంచి యూజర్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆఫర్లు ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయి. తాజా సేల్‌లో ప్రీమియం స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. కోటక్ బ్యాంక్, SBI కార్డులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఆ వివరాలు చూద్దాం.
* డిస్కౌంట్లో లభిస్తున్న ప్రొడక్ట్స్ : ఫ్లిప్‌కార్ట్ దివాలీ సేల్‌లో టీవీలు, ఆడియో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్ ఉన్నాయి. గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉంది. వినియోగదారులు రెగ్యులర్ HD స్మార్ట్ టీవీలను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. వివిధ బ్రాండ్ల 4K టీవీలను రూ. 17,249 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్లు, ఇతర అన్ని రకాల ఆఫర్లు కలిపి ప్రొడక్ట్స్ ధరలు మరింత తగ్గాయి.
* ఐఫోన్ 13 : ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ సేల్‌లో కొన్ని ఐఫోన్ మోడళ్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. గత నెలలో జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 13, 128GB మోడల్ ధర ఒక దశలో దాదాపు రూ.48,999కి పడిపోయింది. ఇది అసలు ధర రూ. 69,900 కాగా, ప్రస్తుతం రూ. 66,990కి అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ మోడల్‌పై రూ. 16,900 విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
* మోటో G62 5G : తాజా సేల్‌లో ఫ్లిప్‌కార్ట్.. క్లీన్ ఆండ్రాయిడ్ మోటో G62 5G ఫోన్‌పై డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దీని ధర రూ.17,999 కాగా, బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ఫోన్‌ను రూ. 16,499కే సొంతం చేసుకోవచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoC, 50-మెగాపిక్సెల్ కెమెరా, 5,000 బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది.