1. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) మొబైల్‌ను రూ.3,399 ధరకే కొనొచ్చు. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే రూ.3,399 ధరకు నథింగ్ ఫోన్ 1 లభించనుంది. (image: Nothing)
2. నథింగ్ ఫోన్ 1 మూడు వేరియంట్లలో లభిస్తోంది ప్రస్తుత ధరలు చూస్తే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.36,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.28,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Nothing)
4. అయితే కొందరికి మాత్రం ఈ ఫోన్ రూ.3,399 ధరకే లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు ప్రతీ కొనుగోలుపై కాయిన్స్ వస్తుంటాయి. ఈ కాయిన్స్‌ని రీడీమ్ చేసుకొని ప్రొడక్ట్స్ కొనొచ్చన్న విషయం తెలియనివారు కూడా ఉన్నారు. దీంతో కాయిన్స్ ఎక్స్పైర్ అవుతుంటాయి. ఈ కాయిన్స్ ఉపయోగించి నథింగ్ ఫోన్ 1 కొనొచ్చు. (image: Nothing)
5. నథింగ్ ఫోన్ 1 కొనడానికి రూ.3,399 మాత్రమే చెల్లించి మిగతా మొత్తాన్ని కాయిన్స్ రూపంలో చెల్లిస్తే చాలు ఈ మొబైల్ మీ సొంతం అవుతుంది. అయితే కాయిన్స్ ద్వారా రూ.3,399 ధరకే నథింగ్ ఫోన్ 1 కొనాలంటే మీ దగ్గర 30,600 ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ఉండాలి. ఇన్ని కాయిన్స్ ఉంటేనే నథింగ్ ఫోన్ 1 రూ.3,399 ధరకే లభిస్తుంది. ఈ ఆఫర్‌కు షరతులు వర్తిస్తాయి. (image: Flipkart)
7. నథింగ్ ఫోన్ 1 ఫీచర్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్ప్లే ఉంది. గ్లిఫ్ ఇంటర్ఫేస్ ప్రధాన ఆకర్షణ. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. నథింగ్ ఫోన్ 1 ఆండ్రాయిడ్ 12 + నథింగ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Nothing)
8. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 50MP Sony IMX766 సెన్సార్ + 50MP Samsung JN1 అల్ట్రా వైడ్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP Sony IMX471 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో రాదు. (image: Nothing)