1. బిగ్ బిలియన్ డేస్ తేదీలను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సేల్ జరగనుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్‌లో ఎప్పట్లాగే స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. ఇప్పటికే కొన్ని స్మార్ట్ఫోన్ల సేల్ ధరల్ని రివీల్ చేసింది ఫ్లిప్‌కార్ట్. (image: Poco India)
2. పోకో ఇండియా మూడు నెలల క్రితం రిలీజ్ చేసిన పోకో ఎఫ్4 5జీ (Poco F4 5G) పాపులర్ మొబైల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌పై బిగ్ బిలియన్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఏకంగా రూ.6,000 డిస్కౌంట్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి పోకో ఎఫ్4 బేస్ వేరియంట్‌ను రూ.21,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Poco India)
3. పోకో ఎఫ్4 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.33,999. ఈ మూడు వేరియంట్లపైనా బిగ్ బిలియన్ డిస్కౌంట్స్ పొందొచ్చు. (image: Poco India)
4. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.21,999 ధరకు కొనొచ్చు. రిలీజ్ ధర కన్నా రూ.6,000 తక్కువకే కొనొచ్చు. మూడు వేరియంట్లపైనా ఇవే ఆఫర్స్ లభిస్తాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. నెబ్యులా గ్రీన్, నైట్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తోంది. (image: Poco India)
5. పోకో ఎఫ్4 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఈ4 అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Poco India)
6. పోకో ఎఫ్4 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్‌తో 64మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. (image: Poco India)
7. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పోకో ఎక్స్4 ప్రో 5జీ, పోకో ఎం4 5జీ, పోకో ఎం4 ప్రో 5జీ మోడల్స్‌పైనా ఆఫర్స్ ప్రకటించింది పోకో ఇండియా. బిగ్ బిలియన్ సేల్ ప్రారంభం కాకపోయినా ఇప్పుడు కూడా సేల్ ధరలకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఇక లేటెస్ట్గా లాంఛ్ అయిన పోకో ఎం5 సేల్ కూడా ప్రారంభం అయింది. (image: Poco India)