1. రియల్మీ జీటీ నియో 3టీ (Realme GT Neo 3T) ఇటీవల ఇండియాకు వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కస్టమర్లు అందరికీ ప్రారంభం కాగానే రియల్మీ జీటీ నియో 3టీ సేల్ కూడా ప్రారంభమైంది. ఈ మొబైల్‌పై ఊహించనంత డిస్కౌంట్ లభిస్తోంది. మొదట రూ.7,000 తగ్గింపు లభిస్తుందని ప్రకటించినా రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. (image: Realme India)
2. రియల్మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్మీ ఫ్యాన్స్ ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. వారికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది రియల్మీ. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ప్రకటించడమే కాకుండా, భారీ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. (image: Realme India)
3. గ్లోబల్ మార్కెట్లో ధరల్ని బట్టి రియల్మీ జీటీ నియో 3టీ ధర రూ.30,000 పైనే ఉంటుందని అంచనా వేశారు. కానీ ఈ మొబైల్‌ను రూ.30,000 లోపు సెగ్మెంట్లో రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసింది రియల్మీ. అంతేకాదు... ఏకంగా రూ.7,000 డిస్కౌంట్ కూడా ప్రకటించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10,000 తగ్గింపు లభిస్తోంది. (image: Realme India)
4. రియల్మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొనేవారికి రూ.7,000 తగ్గింపు లభిస్తుంది. (image: Realme India)
5. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.7,000 డిస్కౌంట్‌తో రియల్మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.26,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ.7,000 డిస్కౌంట్‌తో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి అదనంగా రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మొత్తం కలిపి రూ.10,000 తగ్గింపు పొందొచ్చు. (image: Realme India)
6. రియల్మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఈ4 అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ పోకో ఎఫ్4, ఐకూ నియో6, రియల్మీ జీటీ నియో2 లాంటి మొబైల్స్‌లో ఉంది. (image: Realme India)
7. రియల్మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 + రియల్మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
8. రియల్మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 12 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. డ్రిఫ్టింగ్ వైట్, డ్యాష్ ఎల్లో, షేడ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)