ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ లు కనిపిస్తున్నాయి. మినరల్ వాటర్ క్యాన్ లు ప్రతీ రోజు కొనుగోలు చేయడం కంటే కూడా వాటర్ ప్యూరిఫైయర్ లు కొనగోలు చేయడం బెటరని భావిస్తున్నారు ప్రజలు. అయితే.. ధరలు కూడా అందుబాటులో ఉండడంతో ప్రతీ ఒక్కరూ వాటర్ ప్యూరిఫైయర్ లను కొంటున్నారు. ఒకప్పుడు పది వేలకు పైగా ధర ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ లు ప్రస్తుతం పది వేలలోపు ధరలో కూడా అందుబాటులోకి వచ్చాయి. (ఫొటో: https://www.flipkart.com/)
ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో వాటర్ ప్యూరిఫైయర్ లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. మీరు కూడా వాటర్ ప్యూరిఫైయర్ ను కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఇదే మీకు సరైన సమయం. ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం బిగ్ బచాత్ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో వాటర్ ప్యూరిఫైయర్లపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. (ఫొటో: https://www.flipkart.com/)
ముఖ్యంగా పేరొందిన Aquagrand SkyLand 18 Ltr RO + UV + UF + TDS Water Purifier పై మంచి ఆఫర్ ఉంది. దీని వాస్తవ ధర రూ.14,500. అయితే.. దీనిపై ఏకంగా 67 శాతం డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీంతో ఎవరైనా 9,731 తగ్గింపుతో రూ.4769కే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ను సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. (ఫొటో: https://www.flipkart.com/)