Flipkart Sale: రూ.15 వేలకే ఐఫోన్... ఆఫర్ వివరాలు ఇవే
Flipkart Sale: రూ.15 వేలకే ఐఫోన్... ఆఫర్ వివరాలు ఇవే
Flipkart Apple Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ డేస్ సేల్ మొదలైంది. ఈ సేల్ మే 14 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. ఓ యాపిల్ ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.15 వేలకే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
1/ 6
1. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనాలనునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి యాపిల్ ఐఫోన్‌ను రూ.15 వేలకే సొంతం చేసుకోవచ్చు.
2/ 6
2. ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ డేస్ సేల్‌లో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ధర బాగా తగ్గింది. 64జీబీ మోడల్ ధర రూ.30,999 మాత్రమే. 128జీబీ వేరియంట్ ధర రూ.33,999 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.44,999. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, రెడ్ కలర్స్‌లో కొనొచ్చు.
3/ 6
3. ఈ సేల్‌లో ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.15 వేలకే సొంతం చేసుకోవచ్చు. రూ.15,150 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.15,150 విలువ చేస్తే మీరు చెల్లించాల్సింది రూ.15,849 మాత్రమే.
4/ 6
4. ఒకవేళ మీరు సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా ఒక కార్డుపై రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. అంటే మరో రూ.1,000 తగ్గుతుంది. మొత్తంగా చూస్తే ఐఫోన్ ఎస్ఈ 64జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ.15 వేలకే సొంతం అవుతుంది.
5/ 6
5. ఈ ఆఫర్ మే 14 వరకే ఉంటుంది. ఇతర యాపిల్ ఐఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొంటే రూ.6,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐమ్యాక్, యాపిల్ వాచ్‌లపైనా ఆఫర్స్ ఉన్నాయి.
6/ 6
6. ఐఫోన్ ఎస్ఈ స్పెసిఫికేషన్స్ చూస్తే 4.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. యాపిల్ ఏ13 బయానిక్ చిప్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 12 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 7 మెగాపిక్సెల్.