1. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) త్వరలో జరగనుంది. దసరా, దీపావళి సందర్భంగా నిర్వహించబోయే సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభించబోతున్నాయి. గూగుల్ ఇండియాలో రిలీజ్ చేసిన గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6A) స్మార్ట్‌ఫోన్‌పై రూ.16,300 డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. (image: Google)
2. ఓ స్మార్ట్‌ఫోన్‌పై ఇంత భారీ డిస్కౌంట్ లభించడం చాలా అరుదు. ప్రతీసారి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇలాంటి ఆఫర్ ఒక్కటైనా ఉంటుంది. ఈసారి గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించి ఆశ్చర్యపర్చింది ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ఈ డిస్కౌంట్‌తో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కూడా కొనొచ్చు. (image: Google)
3. గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ కేవలం 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజైంది. ధర రూ.43,999. ప్రస్తుతం కూడా ఇదే ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,699 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Flipkart)
4. గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.14 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ డిస్ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్ 13 అప్డేట్ లభిస్తుంది. ఇది క్లీన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. ఇతర యాప్స్ ఉండవు. ఐదేళ్ల పాటు పిక్సెల్ అప్డేట్స్ కూడా లభిస్తాయి. (image: Google)
5. గూగుల్ పిక్సెల్ 6ఏ పూర్తిగా గ్లాస్ డిజైన్‌తో వస్తుంది. గూగుల్ సొంత ప్రాసెసర్ అయిన టెన్సార్ చిప్సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Google)
6. కెమెరాలో లెన్స్ కరెక్షన్, ఆప్టికల్ + ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫాస్ట్ కెమెరా లాంచర్, మ్యాజిక్ ఎరేజర్, రియల్ టోన్, ఫేస్ అన్‌బ్లర్, పనోరమా, మాన్యువల్ వైట్ బ్యాలెన్సింగ్, లాక్డ్ ఫోల్డర్, నైట్ సైట్, టాప్ షాట్, పోర్ట్రెయిట్ మోడ్, పోర్ట్రెయిట్ లైట్, సూపర్ రెస్యూమ్ మోషన్ ఆటో ఫోకస్, ఫ్రీక్వెంట్ ఫేసెస్, డ్యూయల్ ఎక్స్పోజర్ కంట్రోల్, లైవ్ హెచ్డీఆర్+, సినిమాటిక్ పాన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Google)