అత్తారింటికి వెళ్లిన తర్వాత భర్తతో పాటు.. అతడి కుటుంబసభ్యులు కూడా ఉంటారు. వారితో ఎలా సన్నిహితంగా ఉండాలి.. వాళ్ల మనసులను ఎలా గెలుచుకోవాలి అనే విషయాలను కూడా మహిళలు తెగ వెతికేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరినీ ఆకర్షిస్తూ అందరికీ నచ్చే వంటకాలు చేసే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
భర్తలకు కొన్ని అభిరుచులు ఉంటాయి. వాటిని తెలుసుకొని అందుబాటులో ఉంచితే భార్యభర్తలు సంతోషంగా ఉంటారు. అయితే పెళ్లైన చాలామంది మహిళలకు భర్తల అభిరుచులు ఏంటో తెలియదు. అయితే వీటికి సంబంధించి కూడా పెళ్లైన మహిళలు భర్తలకు ఏదంటే ఇష్టం.. దేనిని ఎక్కువగా ప్రేమిస్తారు అనే విషయాలను గూగుల్ చేసేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)