ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఇప్పుడు స్థిరత్వంపై దృష్టి పెట్టింది. అందుకే సమస్యలపై వెంటవెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కంపెనీలో వర్క్‌ఫోర్స్‌ను భారీగా తగ్గించుకున్న అనంతరం వేగంగా మార్పులు చేపడుతోంది. కంపెనీలో కీలక స్థానాలను భర్తీ చేస్తోంది. అలాగే రెవెన్యూ జనరేట్ చేయడం, మరింత మంది యూజర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఫేస్బుక్ వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. (ఫ్రతీకాత్మక చిత్రం)
వివరాల్లోకి వెళ్తే.. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా, ప్రొఫైల్ నుంచి నాలుగు ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి ఈ చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ నుంచి ఫేస్బుక్ ప్రొఫైల్స్‌లో అడ్రస్, రిలీజియస్ వ్యూస్, పొలిటికల్ వ్యూస్, ఇంట్రెస్టెడ్ ఇన్ ఫీల్డ్‌లు కనిపించవు. దీనికి సంబంధించి ఫేస్బుక్ వినియోగదారులకు పంపుతున్న నోటీస్ స్క్రీన్‌షాట్‌ను మాట్ నవర్రా అనే వ్యక్తి ట్వీట్ చేశారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
ఈ లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి టెక్ క్రంచ్‌తో ఫేస్బుక్ ప్రతినిధి మాట్లాడారు. ఫేస్‌బుక్‌ను నావిగేట్ చేయడం, ఉపయోగించడం సులభతరం చేసే ప్రయత్నాలలో భాగంగా, కొన్ని ప్రొఫైల్ ఫీల్డ్‌లను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంట్రెస్టెడ్ ఇన్, రిలీజియస్ వ్యూస్, పొలిటికల్ వ్యూస్, అడ్రెస్ వంటి వాటిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
ఫేస్బుక్లో తమ ప్రొఫైల్‌లో ఈ ఫీల్డ్‌లకు సమాధానాలు నమోదు చేసిన వ్యక్తులకు నోటిఫికేషన్లను పంపుతున్నట్లు చెప్పారు. ఈ ఫీల్డ్‌లను తీసివేస్తున్నట్లు సంబంధిత యూజర్లకు సమాచారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మార్పు తమ గురించిన సమాచారాన్ని యూజర్ ఫేస్బుక్లో మరెక్కడా షేర్ చేసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేయదని తెలిపారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
ఈ నెల ప్రారంభంలో మెటా కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 13 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 11,000 మంది ఉద్యోగులను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నాలుగేళ్ల అనుభం ఉన్న అజిత్ మోహన్ కూడా స్నాప్ ఇంక్‌లో చేరడానికి కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో వెంటనే మెటా కంపెనీ నవంబర్ 17న సంధ్యా దేవనాథన్‌ను మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
దేవనాథన్ APAC లీడర్షిప్ టీంలో భాగమై ఉంటారని, మెటా APAC వైస్ ప్రెసిడెంట్ డాన్ నియరీకి రిపోర్ట్ చేస్తారని కంపెనీ తెలిపింది. వాట్సాప్ ఇండియాలో పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అయిన శివనాథ్ తుక్రాల్.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల పేరెంట్ కంపెనీ మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.(ఫ్రతీకాత్మక చిత్రం)