1. ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేయడం సులభం. https://www.facebook.com/deactivate_delete_account లోకి వెళ్లి అక్కడ ఉండే రకరకాల ఆప్షన్స్ ఎంచుకొని.. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి డిలీట్ బటన్ నొక్కడం ద్వారా అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు. కానీ అదంత సులభంగా ఉండదు. దీన్ని అర్థం చేసుకునేందుకు.. మీరు ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసిన తర్వాత ఫేస్బుక్ ఏం డిలీట్ చేస్తుందో ఏవి డిలీట్ చేయదో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
2. మీరు యాడ్ చేసిన ప్రొఫైల్ ఫొటోలు, ఇతర పోస్టులు, మీరు మీ మిత్రులకు పంపిన మెసేజ్‌లు డిలీట్ కావు. మీ ఫ్రెండ్స్‌కు పంపిన మెసేజ్‌లలో మీ వ్యక్తిగత సమాచారం ఉంటే, అకౌంట్ డిలీట్ చేసిన తరువాత దానిపై మీకు ఎటువంటి కంట్రోల్ ఉండదు. మీరు పోస్టు చేసిన డేటాపై మీకు కంట్రోల్ ఉండదు కాబట్టి ఫేస్బుక్ ఇచ్చిన హామీని మీరు నమ్మాల్సి ఉంటుంది. అయినప్పటికీ మీరు డిలీట్ చేయాల్సిందంతా డిలీట్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
దాన్ని డిలీట్ చేయండి. ఇక మీరు డిలీట్ చేయడం వీలుకాని ఇన్ఫర్మేషన్ను మార్చేయండి. ఉదాహరణకు ఈమెయిల్ అడ్రస్ తొలగించి దాని స్థానంలో ఏదైనా టెంపరరీ లేదా మీరు అంతగా ఉపయోగించని కొత్త ఈమెయిల్ చేర్చండి. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ తొలంగించండి. ఒకవేళ ఫేస్బుక్ మీరు డిలీట్ చేసిన ప్రొఫైల్ కలిగి ఉన్నా ఇవి వాటిని మిస్లీడ్ చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
చివరగా https://www.facebook.com/deactivate_delete_account లింక్‌లోకి వెళ్లి మీ అకౌంట్ డిలీట్ చేయండి. అంతే కాదు 90 రోజుల వరకు అందులో తిరిగి లాగ్ ఇన్ కాకూడదు. ఎందుకంటే యూజర్లు ఫేస్బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసిన 90 రోజుల్లో మీరు పోస్టు చేసినవన్నీ డిలీట్ చేస్తామని ఫేస్బుక్ చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)