Electric Cars:పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ప్రపంచ దేశాలు గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి వాటిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వాహన తయారీ సంస్థలు తమ మోడల్స్‌ను ఈవీ సెగ్మెంట్లోనూ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈవీ విభాగంలో ఆటో ఎక్స్పో-2023 గ్రేటర్ నోయిడా వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ జవనరి 13-18వ తేదీల మధ్య నిర్వహించనున్నారు. వాహన తయారీ సంస్థలు తమ అప్ కమింగ్ ఈవీలను ఇందులో ప్రదర్శించనున్నాయి. ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలువనున్న ముఖ్యమైన ఈవీల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
TATA TIAGO EV : టాటా టియాగో ఈవీ ప్రస్తుత ధరలు రూ.8.49 లక్షలు నుంచి రూ.11.79 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. అయితే వచ్చే నెల నుంచి ఈ మోడల్ ధరలు రూ.35,000 అదనంగా పెరగనున్నాయి. డెలివరీలు కూడా 2023 జనవరి నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో అందుబాటులోకి రానుంది. 19.2 kWh బ్యాటరీ 250 కి.మీ. డ్రైవింగ్ రేంజ్, పెద్ద బ్యాటరీ 315 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది.
BYD ATTO 3: BYD అటో 3 ఈ ఏడాది నవంబర్‌లో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ.33.99 లక్షలు(ఎక్స్-షోరూమ్). కేవలం ఒక నెలలోనే 1500 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి. డెలివరీలు జనవరిలో స్టార్ట్ కానున్నాయి. ఈ మోడల్లో ఫేమ్డ్ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని వినియోగించారు. ఇందులో 60.48 kWh బ్యాటరీ ఉంటుంది. 201 bhp- 301 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటారును ఇందులో అమర్చారు. ఈ ఎస్యూవీ 7.3 సెకన్లలో 0 నుంచి 100 kmph స్పీడ్‌ను అందుకుంటుంది. అంతేకాకుండా ఇది 521 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది.
MAHINDRA XUV400:మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చే ఏడాది లాంచ్ కానుంది. 4.2 మీటర్ల పొడవు, బిగ్ బూట్‌స్పేస్‌తో డిజైన్ పరంగా గత మోడల్ XUV300 మాదిరిగానే ఉంటుంది. మహీంద్రా XUV400 ధరలు వచ్చే నెలలో కంపెనీ వెల్లడించనుంది. ఇందులో 39.4 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.
CITROEN C3 : Citroen C3 ఎలక్ట్రిక్ వెర్షన్‌ను eC3గా పిలుస్తారు. భారత్‌లో వచ్చే నెలలో దీని విక్రయాలు ప్రారంభమవుతాయి. డిజైన్ పరంగా ICE వేరియంట్‌తో పోల్చితే చాలా తక్కువ మార్పులు చేశారు. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్ మౌంట్ అయి ఉంటుంది. సంప్రదాయ గేర్ స్టిక్కు బదులుగా డ్రైవ్ సెలెక్టర్ ఇందులో ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి కొత్త ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఎస్యూవీ 350 కి.మీ. రేంజ్ అందిస్తుంది.