మనలాంటి వారు ఈ విశ్వంలో మరెక్కడైనా ఉన్నారా అనేది నిత్యం మనల్ని వెంటాడుతున్న ప్రశ్న. ఖగోళ శాస్త్రవేత్తలు రోజూ సమాధానం వెతుకుతూనే ఉంటారు. తాజాగా.. తొలిసారిగా అంగారక గ్రహం (Mars) నుంచి భూమికి ఓ కోడ్ (alien signal) వచ్చింది. అనంతవిశ్వం నుంచి మార్స్కి వచ్చిన కోడ్ని గుర్తించిన ఓ ఆర్బిటర్.. ఆ కోడ్ని భూమికి పంపింది. మరి.. ఆ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని అర్థమేంటి?
ఈ కోడ్ని డీకోడ్ చెయ్యడం అసలు సమస్య. మన భూమిపై ఉన్న ఎవరైనా కోడ్ క్రియేట్ చేస్తే.. దాన్ని డీకోడ్ చెయ్యడం తేలికే అవుతుంది. ఎందుకంటే.. అందులోని అక్షరాలు, నంబర్లు అన్నీ.. మనకు తెలిసినవే ఉంటాయి. కానీ ఈ కోడ్ వచ్చింది.. విశ్వం నుంచి. దీన్ని ఎవరు పంపారో, ఎందుకు పంపారో తెలియదు. అందులో ఏం రాశారో చెప్పలేం. వాళ్లు రాసింది ఇదే అని మనం కచ్చితంగా చెప్పుకోలేం. ఎందుకంటే.. వారి భాష మనకు తెలియదు. అందువల్ల ఈ డీకోడ్ అనేది పెద్ద సమస్యే!