1. డిజిటల్ పేమెంట్ వాడకం పెరిగిన తర్వాత సైబర్ క్రైమ్స్ కూడా విపరీతంగా పెరిగాయి. అమాయకులు సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కుతూ మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు వాట్సాప్ (WhatsApp) యూజర్లను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వీరు వాట్సాప్‌లో ఏదో ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పంపి యూజర్లను మోసగిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. రీసెంట్ టైమ్స్‌లో కేటుగాళ్లు ఎక్కువగా 4 రకాల వాట్సాప్ మెసేజ్‌లు (WhatsApp Messages) పంపించి నేరాలకు పాల్పడుతున్నారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఎలక్ట్రిసిటీ బిల్లు, జాబ్ ఆఫర్స్, క్యాష్ ప్రైజ్, వెరిఫికేషన్ కోడ్... ఇలా వేర్వేరు సమాచారంతో ఈ మెసేజెస్ పంపి మోసాలు చేస్తున్నారు నేరగాళ్లు. ఆ మోసాల గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించాల్సిందిగా వాట్సాప్‌లో స్కామ్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ మెసేజ్‌లో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసి వారి చెప్పిన లింకు ద్వారా పేమెంట్ చేస్తే దారుణంగా మోసపోతారు. సాధారణంగా ఈ నంబర్‌కు కాల్ చేస్తే, త్వరగా పేమెంట్ చేయాలని లేదంటే కరెంట్ కనెక్షన్ కట్ అవుతుందని స్కామర్లు యూజర్లను భయపడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. "డియర్ కన్స్యూమర్, మీ కరెంట్ బిల్లు అప్డేట్ కానందున ఈ రాత్రి 9.30 గంటలకు ఎలక్ట్రిసిటీ ఆఫీసు నుంచి మీ కరెంటు కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది. దయచేసి వెంటనే మా విద్యుత్ అధికారిని కాంటాక్ట్ అవ్వండి, థాంక్స్" అంటూ స్కామర్లు మెసేజ్ పంపుతారు. నిజానికి ఏ ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఇలాంటి వాట్సాప్ మెసేజ్‌లు పంపించదు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈరోజుల్లో మోసగాళ్లు యూజర్లకు టెక్స్ట్ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ మెసేజ్ పంపుతూ జాబ్స్ ఇస్తామని చెప్పి మోసాలు చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా... "మీరు మా ఇంటర్వ్యూలో పాసయ్యారు. శాలరీ రోజుకు రూ.8,000. జాబ్ వివరాలు తెలుసుకునేందుకు http://wa.me/9191XXXXXX కి మెసేజ్ పంపించండి" అని స్కామర్లు మెసేజ్‌లు పంపుతున్నారు. ఇది నిజమేనని ఈ మెసేజ్లోని లింక్స్ క్లిక్ చేస్తే మోసపోయే ప్రమాదముంది. స్కామర్లు జాబ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో మీ నుంచి పెద్ద మొత్తంలో అమౌంట్ కాజేసి మోసం చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. స్కామర్లు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా క్యాష్ ప్రైజ్ గెలిచినట్లు చెప్పి మోసాలు చేయడం ఎక్కువైపోయింది. వీరు చాలా తెలివిగా క్యాష్ ప్రైజ్ పొందాలంటే పర్సనల్ డీటెయిల్స్ అందించాల్సిందిగా కోరతారు. "KBC Jio" లక్కీ డ్రాలో భారీగా డబ్బు గెలుచుకున్నారని కూడా నమ్మబలుకుతున్నారు. మాల్వేర్ లింక్స్‌ను క్లిక్ చేసేలా టెంప్ట్ చేస్తారు. బ్యాంకు డీటెయిల్స్ అందించాలంటూ అడుగుతూ తెలివిగా మీ ఖాతాలను ఖాళీ చేస్తారు. లాటరీ డబ్బులు ఇవ్వాలంటే కొంత మనీ జీఎస్టీ రూపంలో చెల్లించాలని కూడా చెప్తారు. ఇవన్నీ మోసగించే అబద్ధాలే కాబట్టి ఎవరూ ఈ తరహా మెసేజ్‌లకు స్పందించకపోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఫ్రెండ్స్ ముసుగులో వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ అడిగే మెసేజ్‌లు గతేడాది బాగా హల్చల్ చేశాయి. ఈ స్కామర్లు ఫ్రెండ్స్ లాగా నటిస్తూ యూజర్ల వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతారు. “హాయ్, సారీ.. నేను మీకు పొరపాటున నా 6-అంకెల కోడ్‌ని SMS ద్వారా పంపాను, దయచేసి దానిని నాకు ఫార్వార్డ్ చేయగలరా? ఇది చాలా అర్జెంట్" అని మెసేజ్ సెండ్ చేస్తారు. ఫ్రెండ్ పంపారేమో అని ఆ OTP పంపిస్తే మీ వాట్సాప్ అకౌంట్‌కి మోసగాళ్లు లాగిన్ అవుతారు. ఆ తర్వాత మీ పర్సనల్ డేటా మొత్తం కలెక్ట్ చేస్తారు. లేదంటే మీ అకౌంట్ నుంచి మీలాగా నటిస్తూ మీ ఫ్రెండ్స్ నుంచి డబ్బులు అడుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం)