1. టాటా న్యూ అనేది ఒకే యాప్‌లోని అన్ని సేవలను అందించే ఒక ఈ-కామర్స్ అప్లికేషన్(Application). ఇది కాంపిటీషన్ యాంగిల్ లో అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలకు కచ్చితంగా ఒక ప్రాబ్లం అవ్వచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లోని టాటా న్యూ యాప్ లిస్టింగ్ ప్రకారం, ఇది షాపింగ్(Shopping), డైనింగ్, ట్రావెల్ వంటి మరికొన్ని సేవలను ఆఫర్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. టాటా న్యూ అన్ని సేవలను ఒకే ఇంటర్ఫేస్లో ఆఫర్ చేస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో షాపింగ్ చేయాలా, ఫ్లైట్ టికెట్ కొనాలా లేదా కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయాలా అనేది నిర్ణయించుకోవచ్చు. ప్లే స్టోర్‌లోని టాటా న్యూ యాప్ డిస్క్రిప్షన్ లో ఇది అన్ని సేవలకు వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్ గా రాబోతోందని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్ (BigBasket), ఫార్మసీ రిటైల్ 1mg, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ క్రోమా, డైరెక్ట్-టు-హోమ్ నెట్వర్క్ టాటా స్కై లేదా టాటా ప్లే వంటి ఓన్ బ్రాండ్లన్నింటికీ సపరేట్ యాప్‌లు లేకుండా ఒకే యాప్‌లో వివిధ సేవలను యాక్సెస్ చేయడానికి టాటా న్యూ యూజర్లను అనుమతిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. పవర్ బిల్లు, ప్రీపెయిడ్/పోస్ట్‌పెయిడ్ మొబైల్ నంబర్ రీఛార్జి, డీటీహెచ్, ఫిక్స్డ్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం పేమెంట్లు చేయడానికి టాటా న్యూని మీరు ఉపయోగించవచ్చు. టాటా న్యూ యాప్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సరే ఎటువంటి సమస్యలు లేకుండా ఉపయోగించే విధంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. మెయిన్ బ్లాక్ ఇంటర్ఫేస్లో స్పష్టంగా పేర్కొన్న అన్ని సేవలు ఉన్నాయి. ఈ బటన్లపై నొక్కడం ద్వారా మీరు టాటా న్యూ అందించే ప్రతి సేవని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. టాటా న్యూను వినియోగదారులందరికీ రిలయబిల్ ఛాయిస్ గా మార్చడానికి, స్మార్ట్‌ఫోన్ యూజర్లు వివిధ సేవల కోసం అనేక యాప్‌లపై డిపెండ్ కావడాన్ని తగ్గించడానికి టాటా గ్రూప్ కృషి చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)