1. మీరు రిలయన్స్ జియో (Reliance Jio) కాకుండా ఇతర నెట్‌వర్క్‌లో ఉన్నారా? మీ సిమ్ కార్డును రిలయన్స్ జియోకు మార్చాలనుకుంటున్నారా? చాలా సింపుల్‌గా జియో నెట్‌వర్క్‌కు మారొచ్చు. వెరిఫికేషన్ తర్వాత కేవలం మూడు రోజుల్లో మీ జియో సిమ్ కార్డ్ (Jio Sim Card) యాక్టివేట్ అవుతుంది. మీరు ప్రస్తుతం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ అయితే మీ ప్రస్తుత బిల్స్ అన్నీ క్లియర్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మీ ఫోన్లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేయండి. SMS PORT <10-digit mobile number> ఫార్మాట్లో మెసేజ్ టైప్ చేసి 1900 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయండి. అంటే ముందు SMS PORT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ 10 అంకెల ఫోన్ నెంబర్ టైప్ చేసి 1900 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. మీకు ఎస్ఎంఎస్ ద్వారా యూనిక్ పోర్టింగ్ కోడ్ (UPC) వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ కోడ్‌కు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దగ్గర్లోని జియో స్టోర్ లేదా జియో రీటైలర్ దగ్గరకు వెళ్లి యూనిక్ పోర్టింగ్ కోడ్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కోసం మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా అడ్రస్ ప్రూఫ్ లేదా ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి. మీ ప్రస్తుత ఆపరేటర్ దగ్గర చెల్లించాల్సిన బిల్స్ ఏవైనా ఉంటే క్లియర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)