1. దివాళీ విత్ ఎంఐ (Diwali With Mi) సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్స్ ప్రకటించింది షావోమీ. స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్ వాచ్ ఉచితంగా పొందే ఛాన్స్ ఇస్తోంది. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ (Redmi Note 11 SE) మోడల్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రెడ్మీ వాచ్ 2 లైట్ ఉచితంగా పొందొచ్చు. (image: Xiaomi India)
2. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్లో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ప్రస్తుతం రూ.12,499 ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై బండిల్ ఆఫర్ ప్రకటించింది షావోమీ. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్, రెడ్మీ వాచ్ 2 లైట్ స్మార్ట్‌వాచ్ కలిపి కొనొచ్చు. (image: Xiaomi India)
3. ఈ రెండూ కలిపి రూ.14,200 ధరకు కొనొచ్చని కంపెనీ ప్రకటించింది. అయితే బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.12,599 ధరకే ఈ రెండూ సొంతం చేసుకోవచ్చు. అంటే రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ ధరకే రెడ్మీ వాచ్ 2 లైట్ ఉచితంగా లభించినట్టే. రెడ్మీ వాచ్ 2 లైట్ వేరుగా కొంటే రూ.4,999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ బండిల్ ఆఫర్ స్టాక్ ఉన్నంతవరకేనని కంపెనీ చెబుతోంది. (image: Xiaomi India)
4. దివాళీ విత్ ఎంఐ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్ వాచెస్, ఆడియో ప్రొడక్ట్స్, స్మార్ట్ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వాల్డ్ డెబబిట్ కార్డుతో కొంటే రూ.5,000 వరకు డిస్కౌంట్, సిటీ బ్యాంక్ కార్డుపై రూ.8,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దివాళీ విత్ ఎంఐ సేల్ దీపావళి వరకు కొనసాగుతుంది. (image: Xiaomi India)
6. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రీడింగ్ మోడ్ 3.0, సన్‌లైట్ మోడ్ 2.0, ఏఐ ఫేస్ అన్‌లాక్, డ్యూయెల్ స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. (image: Xiaomi India)