1. జేబులో ఉండాల్సిన స్మార్ట్‌ఫోన్ (Smartphone) కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టవుతుంది. స్మార్ట్‌ఫోన్ పోయినా, ఎవరైనా దొంగిలించినా దొరకడం కష్టం అనుకుంటారు. కానీ ముందే కాస్త జాగ్రత్తపడితే స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవడం సులువు అవుతుంది. ఇందుకోసం మీరు ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఫైండ్ మై డివైజ్ ఫీచర్ (Find My Device) ఉపయోగించుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఫైండ్ మై ఫీచర్ ఫీచర్‌ను సమర్థవంతంగా ఉపయోగించాలంటే మీరు తప్పనిసరిగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ లొకేషన్ సర్వీసెస్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలి. గూగుల్ అకౌంట్ లాగిన్ కావాలి. ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నప్పుడు, దొంగిలించినప్పుడు మాత్రమే కాదు ఇంట్లో స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా మర్చిపోయినా లొకేట్ చేయడానికి ఈ స్టెటింగ్స్ ఉపయోగపడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. సాధారణంగా ప్రతీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్ అయ్యే ఉంటుంది. మీరు ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెక్యూరిటీ సెక్షన్లో ఫైండ్ మై డివైజ్ ఫీచర్ ఓపెన్ చేయాలి. ఒకవేళ ఈ ఫీచర్ ఆఫ్‌లో ఉంటే ఆన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. వేరే స్మార్ట్‌ఫోన్‌లో లేదా కంప్యూటర్లో గూగుల్ సెర్చ్ పేజ్ ఓపెన్ చేసి ఫైండ్ మై డివైజ్ అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత మీ గూగుల్ అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మ్యాప్‌లో మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది. PLAY SOUND, SECURE DEVICE, ERASE DEVICE మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. స్మార్ట్‌ఫోన్ మీకు దగ్గర్లో ఉన్నట్టు కనిపిస్తే PLAY SOUND క్లిక్ చేయాలి. ఇంట్లో లేదా ఆఫీసులో మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే లొకేట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ లొకేషన్ మీకు దూరంగా కనిపిస్తే SECURE DEVICE పైన క్లిక్ చేసి మెసేజ్, మీ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ టైప్ చేయాలి. స్మార్ట్‌ఫోన్ దొరికినవాళ్లు మిమ్మల్ని కాంటాక్ట్ అవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)