ఈ ఫ్యాన్ బాగుంది కదా. దీన్ని Device కంపెనీ తయారుచేస్తోంది. మడతపెట్టుకునేందుకు వీలుగా ఉన్న ఈ ఫ్యాన్‌ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ ఫ్యాన్‌లో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫ్యాన్ 360 డిగ్రీస్‌లో తిరగగలదు. కరెంటుపోయినప్పుడు బ్యాటరీ ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ ఫ్యాన్ రెక్కలు నిమిషానికి 3,800 సార్లు తిరుగుతాయి.
ఈ ఫ్యాన్ మొత్తం బరువు 842 గ్రాములు... దీన్ని పూర్తిగా మడతపెట్టి... ప్రయాణాల్లో ఈజీగా పట్టుకుపోవచ్చు. బ్యాటరీతో ఈ ఫ్యాన్... హైస్పీడ్‌లో 2-2.5 గంటలు పనిచేస్తుంది. అదే తక్కువ స్పీడ్‌లో 3 గంటల దాకా పనిచేస్తుంది. అలాగే దీని లైట్‌ని ఎక్కువ కాంతితో ఆన్ చేస్తే.. అది 6-8 గంటలు పనిచేస్తుంది.. అదే తక్కువ కాంతితో పనిచేయిస్తే... 8-10 గంటలు పనిచేస్తుంది.