1. మీరు గేమింగ్ లవరా? వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారా? మీ లాంటివారికోసమే బ్లాక్ షార్క్ 2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది బ్లాక్ షార్క్ కంపెనీ. (image: Black Shark)
2. చైనాకు చెందిన బ్లాక్ షార్క్ కంపెనీ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ ఫండింగ్‌తో నడుస్తోంది. గేమింగ్ ఫోన్స్, యాక్సెసరీస్ తయారుచేస్తుంది ఆ కంపెనీ. (image: Black Shark)
3. బ్లాక్ షార్క్ ఇండియాలో తన తొలి స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షార్క్ 2 రిలీజ్ చేసింది. భారతదేశంలో గేమర్లను దృష్టిలో పెట్టుకొని తయారుచేసే ఫోన్లు తక్కువ. బ్లాక్ షార్క్ 2 గేమింగ్ లవర్స్‌ను టార్గెట్ చేస్తోంది. (image: Black Shark)
4. బ్లాక్ షార్క్ 2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ గేమ్స్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినవే. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Black Shark)
5. గేమింగ్ కోసం రూపొందించిన ఫోన్ కాబట్టి ఇతర యాక్సెసరీస్‌ని ఉపయోగించుకోవచ్చు. బ్లాక్ షార్క్ 2 సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. (image: Black Shark)
6. బ్లాక్ షార్క్ 2 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.39 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉన్నాయి. (image: Black Shark)
7. బ్లాక్ షార్క్ 2 రియర్ కెమెరా 48+12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్. (image: Black Shark)
8. బ్లాక్ షార్క్ 2 స్మార్ట్‌ఫోన్ 6 జీబీ+128జీబీ ధర రూ.39,999 కాగా, 12జీబీ+256జీబీ ధర రూ.49,999. (image: Black Shark)