DETAILED IMAGE GALLERY OF REALME 5 PRO QUAD CAMERA SMARTPHONE SS
Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి
Realme 5 Pro | ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు... ఏకంగా నాలుగు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది రియల్మీ. ఇండియాకు రియల్మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఆ ఫోన్ ఎలా ఉందో, స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకోండి.
1. రియల్మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో లాంఛైంది. ఇండియాలో ఇప్పటికే రియల్మీ 1, 2, 3 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసిన రియల్మీ... ఇప్పుడు 5 సిరీస్‌ను తీసుకొచ్చింది. (image: Realme)
2/ 20
2. చైనాలో 4 అంకెను అన్‌లక్కీ నెంబర్‌గా భావిస్తారు. అందుకే చైనా కంపెనీ అయిన రియల్మీ 4 సిరీస్ కాకుండా నేరుగా 5 సిరీస్ లాంఛ్ చేసిందన్న వాదన ఉంది. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్‌ను టార్గెట్ చేసుకొని మార్కెట్లోకి రెండు ఫోన్లను రిలీజ్ చేసింది రియల్మీ. (image: Realme)
3/ 20
3. రియల్మీ 5 ప్రో విషయానికి వస్తే... ఈ ఫోన్ గురించి కొంతకాలంగా టీజర్లతో ఊరిస్తోంది రియల్మీ. మంగళవారం అధికారికంగా లాంఛ్ చేసింది. (image: Realme)
4/ 20
4. రియల్మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో నాలుగు కెమెరాలు ఉండటం విశేషం. 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. (image: Realme)
5/ 20
5. రియల్మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రావైడ్ లెన్స్, Sony IMX586 ప్రైమరీ లెన్స్, పోర్ట్రైట్ లెన్స్, మ్యాక్రో లెన్స్‌తో నాలుగు కెమెరాల స్మార్ట్‌ఫోన్ ఇది. (image: Realme)
6/ 20
6. రియల్మీ 5 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 ఫుల్హెచ్డీ+ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Realme)
7/ 20
7. రియల్మీ 5 ప్రో బ్యాటరీ 4035 ఎంఏహెచ్ కాగా టైప్ సీ పోర్ట్‌తో VOOC 3.0 ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. (image: Realme)
8/ 20
8. రియల్మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ ధర రూ.13,999 కాగా, 6జీబీ+64జీబీ ధర రూ.14,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.16,999. (image: Realme)
9/ 20
9. రియల్మీ 5 ప్రో ప్రీ-ఆర్డర్ ఆగస్ట్ 28న ప్రారంభం అవుతుంది. (image: Realme)