1. స్మార్ట్‌ఫోన్ మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఎక్కడి నుంచే సైబర్ మోసగాళ్లు (Cyber Fraudsters) మీ స్మార్ట్‌ఫోన్ ఆపరేట్ చేస్తుంటారు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? హ్యాకర్లు పుట్టిస్తున్న మాల్వేర్స్తో ఇది సాధ్యం. లేటెస్ట్గా అలాంటి ఓ మాల్వేర్ బయటపడింది. ఆ మాల్వేర్ పేరు ఆక్టో (Octo Malware). మీకు తెలియకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తన కంట్రోల్లోకి తీసుకోవడం ఈ మాల్వేర్ ప్రత్యేకత. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఒక్కసారి ఈ మాల్వేర్ కంట్రోల్లోకి మీ స్మార్ట్‌ఫోన్ వెళ్లిందంటే ఆ మొబైల్లో ఉన్న బ్యాంకింగ్ వివరాలతో సహా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కాజేస్తుంది ఆక్టో మాల్వేర్. థ్రెట్ ఫ్యాబ్రిక్ సంస్థలోని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ ఆక్టో మాల్వేర్ను గుర్తించారు. ఈ ట్రోజాన్ సాయంతో మీ డివైజ్‌ను దూరం నుంచే ఆపరేట్ చేస్తారు సైబర్ ఎటాకర్స్. (ప్రతీకాత్మక చిత్రం)
3. 2018 లో బయటపడ్డ ఎక్సోబాట్ మాల్వేర్ నుంచి ఆక్టో మాల్వేర్ పుట్టుకొచ్చినట్టు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ గుర్తించారు. ఈ మాల్వేర్తో దాడి చేసి సైబర్ నేరగాళ్లు మీ డివైజ్‌ను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఆ తర్వాత మీరు ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో మీ బ్యాంకింగ్ వివరాలను గుర్తిస్తారు. మీకు తెలియకుండా మీరు స్మార్ట్‌ఫోన్‌లో ఏమి ఆపరేట్ చేస్తున్నారో చూస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మీరు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే మీ స్క్రీన్‌ను స్ట్రీమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్‌లో బిల్ట్ ఇన్ సర్వీసెస్‌గా ఉన్న మీడియా ప్రొజెక్షన్, యాక్సెసబిలిటీ సర్వీస్ లాంటి సేవల్ని ఆక్టో మాల్వేర్ ఉపయోగించుకుంటుంది. డివైజ్‌లో ఉండే యాంటీ మాల్వేర్ ఇంజిన్లను కూడా మభ్యపెడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎటాకర్ డివైజ్‌ను తమ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత రిమోట్ యాక్షన్స్ ద్వారా బ్లాక్ స్క్రీన్ ఓవర్లే చేస్తుంది. do not disturb మోడ్ కూడా ఎనేబుల్ చేస్తుంది. అన్ని నోటిఫికేషన్లను ఆపేస్తుంది. డివైజ్ స్విచాఫ్‌లో ఉన్నట్టు కిపిస్తుంది. కానీ ఎటాకర్లు ఆ డివైజ్‌లో తాము చేయాల్సిన పనులు చేస్తూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)