డెబిట్ కార్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ కార్డ్ కొత్త రూల్, ఆర్బీఐ కొత్త రూల్, కార్డ్ కొత్త రూల్" width="1200" height="800" /> 2. పెరిగిన టెక్నాలజీ(Technology) ఆధారంగా సైబర్ మోసాలు(cyber crimes) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)
4. తాజాగా NordVPNలోని ఒక కొత్త నివేదిక ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..కంప్యూటర్ను ఉపయోగించి, సగటు చెల్లింపు కార్డును కేవలం ఆరు సెకన్లలో హ్యాక్ చేయవచ్చు. గ్లోబల్ VPN సర్వీస్ ప్రొవైడర్ 140 దేశాల నుండి నాలుగు మిలియన్ల పేమెంట్ కార్డులను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇంకా పేమెంట్ కార్డ్‌ను హ్యాక్ చేయడానికి 'బ్రూట్ ఫోర్స్' అత్యంత సాధారణ పద్ధతి అని కనుగొన్నారు.NordVPN చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారిజస్ బ్రీడిస్ మాట్లాడుతూ, "డార్క్ వెబ్‌లో ఇంత భారీ సంఖ్యలో పేమెంట్ కార్డ్‌లు కనిపించడానికి ఏకైక మార్గం బ్రూట్-ఫోర్సింగ్. అంటే నేరస్థులు కార్డ్ నంబర్ ఇంకా CVVని తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. కంప్యూటర్ని ఉపయోగించి, ఇలాంటి దాడికి ఆరు సెకన్లు మాత్రమే పట్టవచ్చు." అని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ మధ్య కాలంలో హోటళ్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు వంటి ప్రదేశాల్లో పబ్లిక్ హాట్స్పాట్లు, Wi-Fiలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇలా పబ్లిక్ నెట్‌వర్క్‌ల(Public Network) ద్వారా ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తే, ఆ సమయానికి దానిని ఉపయోగించకుండా ఉండటమే మేలు అంటున్నారు నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎందుకంటే ఇవి ఓపెన్ నెట్‌వర్క్‌లు. అందువల్ల వాటిని హ్యాకర్లు సులభంగా ఛేదించగలరు. ఫలితంగా మన బ్యాంక్ ఖాతాలోని కీలక సమాచారాన్ని యాక్సెస్ చేసి డేటాను చోరీ చేస్తారు. వీలైనంత వరకు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌కి కనెక్ట్ చేసిన సమయాల్లో మాత్రమే ఆర్థిక లావాదేవీలు చేస్తే మేలు. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, పర్సనల్ ఫైనాన్స్, క్రెడిట్ కార్డ్ టిప్స్" width="1200" height="800" /> 8. షాపింగ్ మాల్స్, గ్రాసరీ స్టోర్లు, మెడికల్ షాపుల్లోనూ బిల్లింగ్ సమయాల్లో ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి వస్తోంది. అయితే అప్పుడప్పుడూ ఆయా సంస్థల పేరిట మెసేజ్‌లు, ఈమెయిల్ల్స్ వస్తుంటాయి. ప్రైజ్ మనీ గెలిచుకున్నామని, రివార్డ్‌లు వచ్చాయని.. చెబుతూ సైబర్ నేరగాళ్లు(Cyber Crime) లింక్‌లు పంపుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)