Flipkart Offers | మీరు కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే మీకోసం సూపర్ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే.
2/ 9
దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో కూకా స్మార్ట్ టీవీపై అదిరే ఆఫర్ లభిస్తోంది. 40 ఇంచుల స్మార్ట్ టీవీని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఆఫర్ పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
3/ 9
కూకా 40 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్పీ రూ. 39,999గా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీని రూ. 14,999కు కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు నేరుగానే 62 శాతం మేర డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు.
4/ 9
అంతేకాకుడా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ టీవీని రూ. 13,749కు కూడా సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఈ టీవీని కొంటే మీకు అదనంగా రూ. 1250 డిస్కౌంట్ వస్తుంది.
5/ 9
ఈ స్మార్ట్ టీవీలో మీరు అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటివి అన్నీ చూడొచ్చు. కూలిటా ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీ పని చేస్తుంది. ఇందులో 30 వాట్ సౌండ్ ఔట్పుట్ ఉంటుంది. ఇంకా 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు ఉంది.
6/ 9
బెజిల్ లెస్ డిస్ప్లే, క్రోమ్ కాస్ట్, కూల్గో టీవీ యాప్, ఐ ప్రొటెక్షన్ మోడ్, స్వాయిట్ హోమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేశారు. బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కోసం చూసే వారు దీన్ని ఒకసారి పరిశీలించొచ్చు.
7/ 9
అలాగే ఈ స్మార్ట్ టీవీపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు 5 వేలు పడుతుంది. రెగ్యులర్ ఈఎంఐ అయితే 24 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 721 చెల్లిస్తే సరిపోతుంది .
8/ 9
అదే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు వాడే వారు అయితే 36 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 528 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డు లేకపోతే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా మీరు ఈ టీవీ కొనొచ్చు. నెలకు రూ. 1419 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది టెన్యూర్‌కు ఈ ఈఎంఐ వర్తిస్తుంది.
9/ 9
ఇక్కడ మీరు ఎంచుకునే క్రెడిట్ కార్డు ప్రాతిపదికన కూడా ఈఎంఐ మారుతుంది. అందుకే మీ వద్ద ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉంటే.. దేనిపై ఆఫర్ ఉందో చెక్ చేసుకోండి. తర్వాత కొనుగోలు చేయండి. మంచి డీల్ సొంతం చేసుకోవచ్చు.