1. ఆన్లైన్లో ఏ అకౌంట్ ఓపెన్ చేసినా పాస్వర్డ్ తప్పనిసరి. అందరికీ జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చడం తప్పనిసరి. ప్రతీ ఆరు నెలలకు ఓసారి లేదా పాస్వర్డ్ ఇతరులకు తెలిసిందన్న అనుమానం వచ్చిన ప్రతీసారి జీమెయిల్ పాస్వర్డ్ మార్చాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఎప్పటికప్పుడు జీమెయిల్ పాస్వర్డ్ మారిస్తే సైబర్ దాడుల్ని, హ్యాకింగ్‌లను అడ్డుకోవచ్చు. చాలావరకు ఇతర అకౌంట్స్‌లలో జీమెయిల్ ద్వారా లాగిన్ అవుతుంటారు. కాబట్టి జీమెయిల్ పాస్వర్డ్ లీక్ అయిందంటే మిగతా అకౌంట్లకూ ముప్పే. అందుకే జీమెయిల్ పాస్వర్డ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. పొరపాటున కూడా పాస్వర్డ్ ఇతరులకు చెప్పొద్దు. తరచూ పాస్వర్డ్స్ మారుస్తూ ఉండాలి. మీ జీమెయిల్ పాస్వర్డ్ మార్చడానికి ముందుగా http://myaccount.google.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. లేదా జీమెయిల్ అకౌంట్ లాగిన్ కావాలి. అకౌంట్ ఐకాన్ పైన క్లిక్ చేసి Manage Your Google Account పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీ పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలను పాస్‌వర్డ్‌గా పెట్టకూడదు. 11111111, 22222222... ఇలాంటి సులువైన పాస్వర్డ్స్ కూడా పెట్టొద్దు. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంత సింపుల్ పాస్వర్డ్స్ పెట్టడం చాలామందికి అలవాటు. ఇంత ఈజీ పాస్వర్డ్స్ పెడితే మీ అకౌంట్ హ్యాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇలాంటి పాస్‌వర్డ్స్‌ని హ్యాకర్లు సులువుగా తెలుసుకోగలరు. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలి. కనీసం 8 క్యారెక్టర్లు పాస్వర్డ్ ఉండాలని గూగుల్ సూచిస్తుంది. కానీ 12 క్యారెక్టర్లతో పాస్వర్డ్ క్రియేట్ చేయడం మంచిది. లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కలిపి 12 క్యారెక్టర్ల పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)