1. కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టాల్లో మరిన్ని మార్పులు చేయబోతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు (Social Media Platforms) మెరుగైన జవాబుదారీతనం తప్పనిసరి చేసేలా చట్టపరమైన నిర్మాణాన్ని రూపొందించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతదేశంలో కోట్లాది యూజర్లను కలిగి ఉన్న ప్రముఖ ప్లాట్‌ఫామ్‌ల కోసం కఠినమైన నియమాలు రూపొందించి ఏడాదైంది. ఇప్పుడు మరిన్ని కఠిన నియమాలను రూపొందించబోతోంది కేంద్ర ప్రభుత్వం. తమ ప్లాట్‌ఫామ్‌లల్లో చట్టవిరుద్ధమైన, రెచ్చగొట్టే కంటెంట్, సంభాషణలకు చెక్ పెట్టడానికి సోషల్ మీడియా, ఇంటర్నెట్ కంపెనీలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అలాంటి కంటెంట్ మూలాలను పసిగట్టేలా చర్యలు ఉండాలని భావిస్తోంది. ఎక్కువ జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందన్న వాదనపై ఏకాభిప్రాయం కుదిరిందని, ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లకు పెద్దగా జవాబుదారీతనం లేదని, ప్రింట్ న్యూస్ మీడియా లాంటి సాంప్రదాయ సెటప్ లేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. వివిధ ప్లాట్‌ఫామ్‌లల్లో చట్టవిరుద్ధమైన, ఉద్వేగభరితమైన సంభాషణలను తనిఖీ చేయడంలో వైఫల్యం కనిపిస్తోందని, ఇది భారతదేశ సామాజిక పరిస్థితులకు, వ్యక్తిగత సంబంధాలకు కూడా భంగం కలిగించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి సోషల్ మీడియా కంపెనీలకు అందించిన సేఫ్ హార్బర్ రక్షణ కారణంగా ఇవి తప్పించుకోగలుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో రూపొందించిన చట్టాన్ని ప్రభుత్వం తొలగించినందున, కొత్త IT చట్టంలో భాగంగా చాలా మార్పులు రాబోతున్నాయి. భారతదేశంలో ఐటీ నియమాల సమగ్ర పరిశీలనలో భాగంగా, డేటా రక్షణ చట్టం వంటి అనేక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. 2021 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలను జవాబుదారీగా చేస్తే ఐటీ రూల్స్ 2021 అమలు చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)