1. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 320 మొబైల్ యాప్స్‌ని బ్లాక్ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని (IT Act) నియమనిబంధనల ప్రకారం యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ యాప్స్‌ని నిషేధించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ ఈ విషయాన్ని లోక్‌సభలో రాతపూర్వకంగా తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రత దృష్ట్యా ఈ మొబైల్ యాప్స్ నిషేధించినట్టు ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో 49 యాప్స్‌ని కేంద్ర ప్రభుత్వం రీబ్లాక్ చేసింది. అంటే గతంలో ప్రభుత్వం బ్లాక్ చేసిన యాప్స్ వేరే పేర్లతో రీబ్రాండింగ్ చేసి మళ్లీ ఇండియాకు వచ్చాయి. వాటిని గుర్తించిన ప్రభుత్వం 49 యాప్స్‌ని మళ్లీ బ్లాక్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 320 మొబైల్ యాప్స్‌ని భారతదేశం నిషేధించింది. భారతదేశం నిషేధించిన యాప్స్‌లో చాలావరకు చైనా మూలాలు ఉన్నవే. 2020 నుంచి చైనా యాప్స్‌ని నిషేధిస్తోంది భారత ప్రభుత్వం. 2020లో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటి నుంచి యాప్స్ నిషేధించే ప్రక్రియ కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక 2000 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు 2.45 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చైనా నుంచి వచ్చినట్టు మరో సమాధానంలో కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ వెల్లడించారు. భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 0.43 శాతంతో చైనా 20వ స్థానంలో ఉన్నట్టు ఆయన వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 21 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 146 కేంద్ర అనుమతుల్ని నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) పోర్టల్ ద్వారా చేశామని సోమ్ ప్రకాశ్ తెలిపారు. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సింగిల్ విండో సిస్టమ్స్ NSWS పోర్టల్‌తో లింక్ అయ్యాయన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)