CAMERA PERFORMANCE OF IPHONE CAN DAMAGE WITH MOTORCYCLE VIBRATIONS SAYS APPLE KNOW WHY SS
Apple: ఐఫోన్ యూజర్లకు అలర్ట్... ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ ఆ పనిచేయరు
Apple iPhone | మీరు యాపిల్ ఐఫోన్ (Apple iPhone) స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? మీరు ఎక్కువగా బైక్ నడుపుతుంటారా? అయితే జాగ్రత్త అంటోంది యాపిల్. బైక్ నడపడానికి, యాపిల్ ఫోన్ వాడటానికి లింక్ ఏంటనుకుంటున్నారా? ఏంటో తెలుసుకోండి.
1. యాపిల్ ఐఫోన్ వాడుతున్నవారికి అలర్ట్. జేబులో ఐఫోన్ పెట్టుకొని బైక్ నడిపితే మీ ఐఫోన్ కెమెరా డ్యామేజ్ అవుతుంది. ఈ విషయాన్ని యాపిల్ స్వయంగా వెల్లడించింది. మోటార్ సైకిళ్లలోని హై పవర్డ్ ఇంజిన్స్ ఐఫోన్ కెమెరా పెర్ఫామెన్స్‌ను తగ్గిస్తుందని యాపిల్ సపోర్ట్ ఫోరమ్‌లో తెలిపింది.
2/ 7
2. మీ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ వైబ్రేషన్స్ ఉంటే ఇంజిన్లకు దూరంగా ఉంచాలని యాపిల్ చెబుతోంది. ఇలా ఎక్కువ కాలం మీ ఐఫోన్ ఎక్కువ వైబ్రేషన్స్‌కి గురైతే కెమెరా దెబ్బతినడం ఖాయం.
3/ 7
3. ఈ వైబ్రేషన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, కెమెరాకు ఉండే క్లోజ్డ్ లూప్ ఆటోఫోకస్ దెబ్బతింటుందని యాపిల్ తెలిపింది. ఎలక్ట్రిక్ ఇంజిన్స్, మోపెడ్స్, స్కూటర్స్ లాంటి తక్కువ వైబ్రేషన్స్ ఉండే వాహనాలతో ఐఫోన్ కెమెరాకు ఇబ్బంది ఉండదని తెలిపింది.
4/ 7
4. ఐఫోన్‌ను బైక్ హ్యాండిల్ బార్, చేసిస్ పైన పెట్టి డ్రైవ్ చేస్తే వైబ్రేషన్స్ కెమెరాను డ్యామేజ్ చేస్తుందని, ఇమేజ్, వీడియో క్వాలిటీ దెబ్బతింటుందని యాపిల్ తెలిపింది.
5/ 7
5. ఫోటో క్లిక్ చేసేప్పుడు ఫోన్ కదిలితే ఇమేజ్ బ్లర్‌గా వస్తుందని తెలుసు. ఈ సమస్యకు పరిష్కారంగా ఐఫోన్ మోడల్స్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. వైబ్రేషన్స్ కారణంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దెబ్బతింటే కెమెరా పర్ఫామెన్స్ కూడా తగ్గిపోతుంది.
6/ 7
6. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు క్లోజ్డ్ లూప్ ఆటోఫోకస్ కూడా ఐఫోన్లలో ఉంటుంది. స్టిల్స్, వీడియోస్, పనోరమా లాంటి ఫోటోలు క్లిక్ చేసేప్పుడు గ్రావిటీ, వైబ్రేషన్‌ను అడ్డుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
7/ 7
7. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీ ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 7 ఫోన్లతో పాటు ఆ తర్వాత వచ్చిన ఫోన్లలో ఉంది. దీంతోపాటు క్లోజ్డ్ లూప్ ఏఎఫ్ ఐఫోన్ ఎక్స్ఎస్, ఆ తర్వాత ఫోన్లలో ఉంది.